ఒకే సినిమాలో ఏకంగా ఐదు మంది హీరోయిన్స్ ... సౌత్ లో ప్రయోగం

సౌత్ లో ఈ మధ్యకాలంలో ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.కొత్త దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెరపై తమ టాలెంట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

 Five Heroines For One Movie In Kollywood, Tollywood, Kajal Aggarwal, Regina Kasa-TeluguStop.com

ఇక ఇలాంటి వారి కథలు చేయడానికి కొంత మంది హీరోలు కూడా సిద్ధంగానే ఉన్నారు.అలాగే హీరోయిన్స్ కి అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ లు రావడమే లేట్.

వెంటనే కాదనకుండా ఒప్పేసుకుంటున్నారు.ప్రశాంత వర్మ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కాన్సెప్ట్ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.మల్టీ పర్శనల్ డిజార్డర్ ఉన్న అమ్మాయి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించి మెప్పించింది.

అలాగే సీత సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది.

ఇక రీసెంట్ గా లైవ్ టెలికాస్ట్ అనే హర్రర్ వెబ్ సిరీస్ లో కూడా కాజల్ అగర్వాల్ డిజిటల్ ఎంట్రీలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ట్రై చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వినూత్నమైన కథాంశంతో తెరకెక్కనున్న హర్రర్ థ్రిల్లర్ కథకి ఈ భామ ఒకే చెప్పింది.అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు మరో నలుగురు హీరోయిన్స్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.

మొత్తం ఐదు మంది అమ్మాయిల చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది.వారిలో దెయ్యం ఎవరనేది ఈ సినిమా కాన్సెప్ట్ అని తెలుస్తుంది.జుగల్‌బందీ స్టెల్‌లో మహిళా ప్రధాన కథాంశంతో సాగే హారర్‌ సినిమా ఇదని, ఐదుగురు కథానాయికల పాత్రలకు సమప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు డీకే పేర్కొన్నారు.అతీంద్రియ శక్తులు ఉండి వాటిని వినియోగించుకోలేని యువతిగా కాజల్‌ కనిపించగా, ఆమెను అనుక్షణం వ్యతిరేకించే యువతిగా రెజీనా కనిపిస్తుందని దర్శకుడు అన్నారు.

జననీ, రైజా, నోయారికా పాత్రలు ప్రయోగాత్మక పంథాలో ఉంటాయని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube