మన టాలీవుడ్ లో బాగా చదువుకున్న నటులు వీరే , నాగార్జున గారు ఏం చదువుకున్నారో తెలుసా ?  

Five Heroes Are The Most Educated Celebrities In Our Tollywood-heroes Education Qualification,nagarjuna,rajshekar,sai Dharan Tej,venkatesh

సినిమా హీరోలు అనగానే వీరికి చదువు అబ్బక ఇండస్ట్రీ లోకి వచ్చి సినిమాలు చేస్తున్నారు అని అందరూ అనుకునే మాటే కానీ మన తెలుగు హీరోలు చదువుకున్న చదువుల గురించి మీరు తెలుసుకుంటే తప్పకుండా అవక్కవుతారు.మన టాలీవుడ్ లో ప్రముఖ హీరోల చదువులు ఇవే..

మన టాలీవుడ్ లో బాగా చదువుకున్న నటులు వీరే , నాగార్జున గారు ఏం చదువుకున్నారో తెలుసా ? -Five Heroes Are The Most Educated Celebrities In Our Tollywood

1.నందమూరి కళ్యాణ్ రామ్

నందమూరి హీరో అయిన కళ్యాణ్ రామ్ తన తమ్ముడు Jr. ఎన్టీఆర్ కన్నా కాస్త ఆలస్యంగానే తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యాడు. కళ్యాణ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుండి పొందారు.

తరువాత అమెరికా యూనివర్సిటీలో ఎం.బి.ఏ చేశారు .

కొన్ని రోజులు ఉద్యోగం చేసాక తెలుగు లో హీరోగా పరిచయం అయ్యాడు.

2. అవసరాల శ్రీనివాస్

తెలుగు లో అతి తక్కువ మందిలో అన్ని డిపార్ట్మెంట్ లలో అనుభవం ఉన్న నటుడు అవసరాల శ్రీనివాస్ , ఇతను తెలుగు లో హీరో గా చేసాడు , కమెడియన్ గా నటించాడు , డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , స్క్రీన్ రైటర్ , మ్యూజిక్ కపోసింగ్ ఇలా అన్నింటిలో ప్రావీణ్యం ఉన్నవాడు. శ్రీనివాస్ అమెరికా లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్ళు అక్కడ పని చేసాడు , అష్టా చమ్మా సినిమాలో అనుకోకుండా అవకాశం రావడంతో సినిమాల్లో స్థిరపడ్డాడు.

3. వెంకటేష్ దగ్గుపాటి

వెంకటేష్ గారు తన చిన్నతనం నుండి ఎప్పుడు హీరో అవ్వాలి అని అనుకోలేదంట , దానికి కారణం ఆయన తండ్రి నిర్మాత కావడం తో బాగా చదువుకొని ఆయన బిజినెస్ చూసుకోవాలి అనుకున్నాడు. వెంకటేష్ గారు హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.

కామ్ పూర్తి చేసి అమెరికా లో ఎం.బి.ఏ చేశారు.

తరువాత రామానాయుడు గారి బలవంతం తో సినిమాల్లోకి వచ్చాడు.

4. అక్కినేని నాగార్జున

కింగ్ నాగార్జున టాలీవుడ్ లో బాగా చదువుకున్న టాప్ స్టార్ లలో ఒకరు. ఈయన చెన్నై లో ఇంజనీరింగ్ చేసి , అమెరికా లో ఆటోమొబైల్ ఇంజినీర్ లో మాస్టర్స్ చేశారు.

తరువాత తండ్రి నాగేశ్వర్ రావు గారి బాటలోనే తెలుగు పరిశ్రమ కి పరిచయం అయి టాప్ స్టార్ గా ఎదిగాడు..

5. సాయి ధరమ్ తేజ్

మెగాస్టార్ మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి నుండి చదువుల మీద శ్రద్ద పెట్టేవాడు. అతను బయో టెక్నాలోజి లో మన దేశం లోని టాప్ యూనివర్సిటీ అయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ (IIPM) ఎం.

బి.ఏ ని పూర్తి చేసి పిల్లా నువ్వు లేని జీవితం తో తెలుగు తెరకి పరిచయం అయ్యాడు.

6. డాక్టర్ రాజశేఖర్

తమిళనాడు లో పుట్టి పెరిగి తెలుగు లో సినిమాలు చేసి ఒక్కపుడు టాప్ హీరో గా ఉన్న రాజశేఖర్ గారు .

ఈయన “డాక్టర్ అవ్వాలనుకున్నాడు కానీ యాక్టర్ అయ్యారు ” రాజశేఖర్ గారు చదువుకుంది M.B.B.S ఆయన కొన్నాళ్ళు డాక్టర్ గా పని చేసి సినిమా అవకాశం రావడం తోనే యాక్టర్ గా మారారు.

1990 నుండి 2000 సంవత్సరం మధ్య రాజశేఖర్ ఎన్నో హిట్ లు ఇచ్చారు.

వీళ్ళే కాకుండా అక్కినేని నాగ చైతన్య , అఖిల్ , నారా రోహిత్ , సిద్దార్థ్ , నాగ శౌర్య అందరూ బాగా చదువుకొని సినిమా రంగం లోకి వచ్చినవారే…