వ్యాక్సిన్ తీసుకున్నా డాక్టర్లకు షాకిచ్చిన కరోనా.. ?

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చినా ఇది ప్రజలను ఇంకా భయపెడుతూనే ఉంది.మొన్నటి వరకు ఈ వైరస్ పేరు వింటేనే ప్రాణాలు పోయేవి కానీ ప్రస్తుతం వ్యాక్సిన్ పేరు వింటే జనం భయపడుతు ఉన్నారట.

 Five Doctors From Karnataka Test Positive For Covid-19, Days After Taking Vaccin-TeluguStop.com

కరోనాను నివారించడానికి వేస్తున్న వ్యాక్సిన్ వల్ల జరుగుతున్న ప్రాణనష్టంతో పాటు ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఇంకా సరైన అవగహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందంటున్నారు.మొత్తానికి దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనా ఇంకా జనం ఈ టీకా వేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదట.

అదిగాక ఈ టీకా వేసుకున్న వారికి వచ్చే ఫలితాల వల్ల కూడా ప్రజల్లో అయోమయం నెలకొంటుందట.

ఇకపోతే కర్ణాటకలో 40నుంచి 50 ఏళ్ల వయసున్న ఐదుగురు డాక్టర్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా ఈ మహమ్మారి బారిన పడటం కలకలం రేపుతుంది.

చామరాజనగర్ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఐదుగురు డాక్టర్లు కు తొలి డోస్ తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకిందట.దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇస్తూ, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని, టీకా తీసుకున్న తరువాత దాదాపు 40 రోజులకు శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని, అప్పుడే కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి శరీరానికి వస్తుందని తెలుపుతున్నారు.కాగా వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube