దీపావళిని ఉద్దేశిస్తూ జాత్యహంకార పోస్ట్: క్షమాపణలు చెప్పిన సింగపూర్ ఫిట్‌నెస్ సంస్థ

యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్ 45 ట్రైనింగ్ ఫ్రాంచైజీ అనుబంధ సింగపూర్ ఫిట్‌నెస్ స్టూడియో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీపావళిని ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన జాత్యహంకార వీడియోకు క్షమాపణలు చెప్పింది.సెరంగూన్ గార్డెన్స్‌లోని సబర్బ్ రెసిడెన్షియల్ ఎస్టేట్‌లోని ఫిట్‌నెస్ స్టూడియో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 14 సెకన్ల వీడియోను పోస్ట్ చేసింది.

 Fitness Studio Apologises For Posting 'racially Insensitive' Diwali Video On Ins-TeluguStop.com

ఇందులో ఇద్దరు మహిళలు వ్యాయామం చేస్తూ ‘‘హ్యాపీ దీపావళి’’ అని చెబుతూ తలలు వణుకుతూ కనిపించారని ఛానెల్ న్యూస్ ఏషియా కథనాన్ని ప్రచురించింది.దీనిని చూసిన కొందరు వీక్షకులు దీపావళి సమయంలో విందులకు నో చెప్పినట్లుగా తల వణుకుతున్నట్లు సూచించారంటూ మండిపడ్డారు.

దీపావళి సింగపూర్‌లో పూర్తి సెలవుతో అధికారికంగా జరుపుకునే పండుగల్లో ఒకటి.దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో ఫిటెనెస్ స్టూడియో తన ఇన్‌స్టా ఖాతా నుంచి వీడియోను తొలగించింది.

అంతేకాకుండా శుక్రవారం ప్రత్యేక ఇన్‌స్టాగ్రామ్ కథనంలో ‘‘ ఈ వీడియో జాతిపరంగా సున్నితమైనదనే అభిప్రాయంతో ఏకీభవించినట్లు స్పష్టం చేసింది.ఎఫ్ 45 ఎల్లప్పుడూ స్నేహపూర్వక వాతావరణంలో వ్యాయామం చేయడానికి మంచి ప్రదేశమని పునరుద్ఘాటించింది.

తమ ఉద్దేశ్యాల ద్వారా ఎప్పుడూ అవహేళన చేయడం లేదా ఎవరి మనోభావాలను దెబ్బతీయడం జరగదని సింగపూర్ ఫిట్‌నెస్ స్టూడియో తెలిపింది.జరిగిన తప్పుకు చాలా చింతిస్తున్నామని.

దీనికి క్షమాపణలు కోరుతున్నట్లు ఫిట్‌నెస్ స్టూడియో సదరు పోస్ట్‌లో తెలిపింది.

Telugu Fitnessstudio, Joe Biden, Singapore-Telugu NRI

కాగా.భారతీయుల పర్వదినం దీపావళిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.అగ్రరాజ్యం అమెరికాలో సైతం దీపావళి వెలుగులతో, బాణాసంచా కాల్పులతో ధగధగలాడిపోతోంది.

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ భవనాలపై తొలిసారిగా దీపావళి థీమ్‌ని ప్రదర్శించారు.న్యూయార్క్‌లోని హడ్సన్‌ నదీ తీరంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు.

ఇక్కడ మూడు రోజుల పాటు దీపావళీ వేడుకలు జరగనున్నాయి.అలాగే ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.

అంతేకాకుండా స్వయంగా శ్వేతసౌధంలో దీపాలు వెలిగించిన ఫొటోను షేర్‌ చేసుకున్నారు.అటు అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube