సముద్రంలో ఉండగానే అంటుకున్న మంటలు,తప్పిన పెను ప్రమాదం  

Fishing boat catches fire in Visakhapatnam, Vizag, Fishing boat, Fisher man - Telugu Fisher Man, Fishing Boat, Fishing Boat Catches Fire In Visakhapatnam, Vizag

ఏపీ లోని విశాఖ లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.విశాఖ ఫిషింగ్ బోటు లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - Fishing Boat Catches Fire Vizag

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

సముద్రంలో ఉండగానే బోటు నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లనట్లు సమాచారం.

TeluguStop.com - సముద్రంలో ఉండగానే అంటుకున్న మంటలు,తప్పిన పెను ప్రమాదం-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు మత్సకారులు ఉన్నట్లు తెలుస్తుంది.అయితే వారందరినీ కూడా స్థానిక మత్సకారులు సురక్షితంగా కాపాడడం తో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది.

హార్బర్‌లో ఓ బోటు ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు చేపల వేటకు వెళ్లింది.చేపల వేట తర్వాత తిరిగి వస్తున్న సమయంలో బోటులో ఉన్న వారు పట్టిన చేపలను రకాలు, సైజుల వారీగా వేరు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో ప్రాణాలు కాపాడుకొనేందుకు వారంతా సముద్రంలోకి దూకారు.

అయితే వారందరినీ కూడా స్థానిక మత్సకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు తెలుస్తుంది.ఈ ఘటనలో బోటు కు మంటలు అంటుకోవడం తో దాదాపు బోటు తగలబడినట్లు తెలుస్తుంది.

అయితే ఒక్కసారిగా బోటులో మంటలు చెలరేగడం తో ఆ ఘటన చూసిన ఇతర బోట్ల వారు వెంటనే అక్కడకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.అలాగే, పోర్టు అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం తో వారు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు.

అయితే ఆ బోటులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉండగా, అదృష్టవశాత్తూ అవి పేలలేదని, లేకపోతే మరింత ఘోరం జరిగేదని పోర్టు అధికారులు భావిస్తున్నారు.

అయితే ఈ ఘటనలో బోటు ఇంజిన్, క్యాబిన్ పూర్తిగా దగ్ధమవ్వగా సుమారు రూ.30 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే అసలు బోటులో మంటలు ఎలా చెలరేగాయి అన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

#Vizag #Fisher Man #FishingBoat #Fishing Boat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fishing Boat Catches Fire Vizag Related Telugu News,Photos/Pics,Images..