కుప్పలు కుప్పలుగా చేపలు.. జనం ఏం చేశారంటే ?

సాధారణంగానే ఏదైనా ఫ్రీ గా దొరుకుతుంది అంటే మనుషులు పరిగెత్తుతారు.అలాంటిది కళ్ళెదుటే కుప్పలు కుప్పలు ఏవైనా కాస్ట్లివి పడి ఉంటే చూస్తూ ఎందుకు ఊరికే ఉంటారు.

 Fishes Sundilla Barrage At Mancherial Fishes, Sundilla Barrage, Mancherial, Tel-TeluguStop.com

ఎలా అయినా సరే దొరికినంత దోచుకోవాలి అని అనుకుంటారు.ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఓ ఘటన జరిగింది.

అది తెలిస్తే అవునా అని ఆశ్చర్యపోతారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

తెలంగాణలో ఓ ప్రాంతంలో గత కొద్దీ రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయ్.దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులు అన్ని కూడా నిండు కుండల్లా మారిపోయాయి.

భారీగా వరదలు రావడంతో దాదాపు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు.ఇంకే ముందు బ్యారేజీల్లో ఉండే చేపలు అన్ని కూడా ఒక్కసారిగా కొట్టుకొని వచ్చాయి.

దీంతో చేప ప్రియులు గత 15 రోజులుగా పండుగ చేసుకుంటున్నారు.కుప్పలు కుప్పలు చేపలు బయటపడటంతో మంచిర్యాల జిల్లా గోదావరి నదిపై గల సుందిల్ల ప్రాజెక్టు వద్ద గ్రామస్తులు చేపల కోసం ఎగబడ్డారు.

కేవలం ఆ గ్రామ ప్రజలే కాదు పక్క గ్రామ ప్రజలు కూడా ఆ చేపల కోసం తరలివచ్చారు.బస్తాలు బస్తాలు చేపలు దొరకడంతో అక్కడి చేప ప్రియుల సంతోషం చెప్పలేనిది.