చేపలు రోడ్డు దాటడం ఎప్పుడైనా చూసారా..అయితే ఈ వీడియో చూసేయండి!

మాములుగా మనుషులు రోడ్డు దాటడం సహజమే.కానీ చేపలు రోడ్డు దాటడం మీరు ఎప్పుడైనా చూసారా.

 Fishes Can Cross The Road Telangana Watch Amazing Video Viral In Social Media, V-TeluguStop.com

సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించి మన కళ్ళకు ఏదైనా చూపిస్తారు.కానీ నిజ జీవితంలో అలాంటివి చాలా తక్కువ సందర్భంలో మాత్రమే మన కళ్ళకు కనిపించి అబ్బుర పరుస్తాయి.

తాజాగా అలంటి ఘటనే ఒకటి జరిగింది.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందా అని అనుకుంటున్నారా.మీరు ఈ వీడియో చుస్తే ముందుగా ఆశ్చర్య పోవడం ఖాయం.అంత అద్భుతం ఏముందా అనుకుంటూ ఉన్నారు కదా.అయితే ముందుగా ఈ వీడియో చూసేయండి.ఆ అరుదైన దృశ్యం మీకు కూడా కనువిందు చేస్తుంది.మ్యాటర్ ఏంటంటే.చేపలు రోడ్డు దాటుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గత వారం రోజులుగా తెలంగాణాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి.ఇలాంటి సమయంలో రోడ్డుపై వర్షపు నీటిలో చేపలు రోడ్డు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.”మనుషులే కాదు.చేపలు కూడా రోడ్డు దాటుతున్నాయి” అంటూ ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసాడు.

అది కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది.

అయితే నిజానికి ఈ వీడియో ఇప్పుడు పడుతున్న వర్షాల కారణంగా వచ్చింది కాదు.2016 లో యూట్యూబ్ లో పెట్టిన వీడియో తాజాగా ఇప్పుడు బయట పడింది.అప్పుడు జరిగిన ఆ వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.

ఇది తెలంగాణాలో జరిగింది కాదని తెలిసిన ఆ దృశ్యం మాత్రం నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube