ఈ చేప ఖరీదు ఐదున్నర లక్షలు.ఎందుకంత రేటో తెలుసా?

ఒక చేప ఖరీధు ఎంత ఉంటుంది.దాని బరువు తూగేదాన్ని బట్టి ఉంటుంది.

 Fishermen Brothers Net A Lottery Off Mumbai Coast Sell A Fish For Rs 5 5 Lakh-TeluguStop.com

సరే మనం కొనే చేపలు కిలో ఎంత ఉంటాయి 200 నుండి నాలుగొందలు అనుకుందాం.కాని ముఫ్పై కిలోల చేపని 5లక్షలు పైన డబ్బులు పెట్టి కొన్నారంటే నమ్ముతారా.

నమ్మితీరాలి.చేపల్లోనే బంగారం లాంటి చేపను ఎందుకు కొనరూ.

ఇంతకీ ఇంత డబ్బు పెట్టి కొన్నారంటే ఈ చేప యొక్క విశిష్టత తెలుసుకోవాల్సిందే.

ముంబైకి చెందిన మహేశ్ మెహర్, భరత్ ఇద్దరూ అన్నదమ్ములు.సాయి లక్ష్మీ అనే చిన్న మర పడవతో సముద్రంలో వేట సాగించే మహేశ్, భరత్‌లు ఎప్పటిలాగే డ వేటకు వెళ్లారు.వేట పూర్తిచేసుకుని ముర్బే తీరానికి తిరిగొస్తుండగా 30 కిలోల బరువుండే ఘోల్ అనే అరుదైన చేప వారి వలలో పడింది.దీన్ని ఐదున్నర లక్షలకి ఒక వ్యక్తి సొంతం చేసుకున్నాడు.

శరీరంపై నలుపు రంగులో మచ్చలు ఉండే ఈ చేప శాస్త్రీయనామం.ప్రొటోనిబే డయాకాంథస్.

దీన్ని చేపల్లో బంగారమని అంటారు.స్థానిక మార్కెట్‌లో దీనికి మంచి గిరాకీ ఉంది.

గ్రేడ్ బట్టే ధర కూడా ఉంటుంది.ప్రస్తుతం లభించిన చేప హైగ్రేడ్ రకం.దీన్ని సింగ్‌పూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్‌లకు ఎగుమతి చేస్తారు.ఇందులో నాసిరకం చేప ధర కూడా కిలో రూ.800 నుంచి రూ.1,000 పలుకుతుందట.

ఈ చేప చాలా రుచికరమైందే కాదు, తూర్పు ఆసియాలో అత్యంత ఖరీదైంది కూడా.దీని అంతర్గత అవయవాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.అధిక నాణ్యత కలిగిన కోల్లేజన్లు ఘోల్ చర్మం నుంచి లభిస్తాయి.

దీన్ని అనేక రకాలు ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీల వాడుతారు.దీని రెక్కలను ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు, వైన్ శుద్ధిచేయడానికి వినియోగిస్తారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఈ చేప ఎక్కువగా భారత తీర ప్రాంతాలతోపాటు పసిఫిక్ తీరంలోనూ లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube