వింత: మనిషి ముఖం లా చేప తల

వింత: మనిషి ముఖం లా చేప తల

మనిషి ముఖం తో చేప కనపడడం ఏంటి అని అనుకుంటున్నారా.అదేదో తెలుగు సినిమా లో సాగర కన్య లాగా తల భాగం మనిషి గా, కింద భాగం చేప లాగా ఉన్న విషయం గుర్తుకు వస్తుంది కదూ.

 Fish With Human Face China-TeluguStop.com

కానీ వాస్తవానికి అది చేప నే కానీ దాని ముఖం చూస్తే మాత్రం అచ్చం మనిషి లా ఉందట.ఈ ఘటన చైనా లో చోటుచేసుకుంది.

చైనా లోని ఒక కుగ్రామంలో దారంతా వెళుతున్న ఒక యువతికి చెరువు లో చేప కనిపించింది.అయితే ఆ చేపను చూసిన ఆ యువతి ఆశ్చర్యానికి గురైంది.

ఎందుకంటే ఆ చేప తల చూడడానికి అచ్చం మనిషి ముఖం లాగా కనిపించడం తో ఆశ్చర్యపోవడం ఆ యువతి వంతు అయ్యింది.ఆ చేపను చూసి ఒక్కసారిగా తన కళ్ళను తానే నమ్మలేకపోయింది.

మనిషి నోరు, ముక్కు, కళ్ళ రూపు కలిగిన అది నీటిలో ఈదడం చూసి ఆమె ఒక్కసారిగా ఖంగుతినింది.మొత్తానికి తనకు జరిగిన ఈ ఎక్స్ పీరియన్స్ ను అందరికి షేర్ చేయాలనీ దీని తాలూకు వీడియోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

కేవలం 17 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో చూసిన వారంతా తలో రకంగా స్పందించారు.

Fish, Fish Face, Face Fish, Telugu Vira Ups-

అసలది చేపేనా ? లేక ఆ యువతి ఏదో ‘ మాయాజాలం ‘ చేసి.మార్ఫింగ్ తో ఈ వీడియోను రూపొందించిందా కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం అది నిజమైన మత్స్యమేనని, ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయంటూ సమర్థిస్తున్నారు.మరి ఇలాంటి మనిషి ముఖాన్ని పోలిన చేపలు కూడా ఉంటాయి అన్న విషయం దీనిని చూస్తే మాత్రం అర్ధం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube