వైరల్ వీడియో: అచ్చం పక్షివలె ఉన్న చేపలు..!  

ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల వింత వింత జీవులు భూమి మీద కనిపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎన్నో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం.

TeluguStop.com - Fish Look Like A Bird Beach

తాజాగా అలాంటి వీడియో మరొకటి కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

దక్షిణాఫ్రికా దేశంలోని కేప్టౌన్ నగరానికి దగ్గరలో ఉన్న ఫిష్ బీచ్ లో ఈ మధ్య కొన్ని వింత జీవులు మనుషులకు కనపడ్డాయి.వాటి ఆకారం చూడటానికి చాలా వింతగా కనబడుతుంది.

TeluguStop.com - వైరల్ వీడియో: అచ్చం పక్షివలె ఉన్న చేపలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

అచ్చం పక్షులు రెక్కలు ఎలా కలిగి ఉంటాయో అలాగే చేపలు కూడా నీలం, వైలెట్ రంగుల రత్నం మిశ్రమంగా చూడడానికి ఎంతో బాగా అనిపించేలా చేపలు కనపడ్డాయి.ఆ చేపలు చూడటానికి అచ్చం డ్రాగన్ ఆకారంలో కనబడతాయి.

ఆ బీచ్ లో అలాంటి చేపలు ఏకంగా 20 వరకు కనిపించాయని అక్కడి స్థానికులు తెలిపారు.ఇలా కొత్తగా కనిపించిన చేపలను చూసి ఆ ప్రాంత ప్రజలు వాటికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో.

ఆ విషయం కాస్త పరిశోధకులకు తెలియడంతో అనేకమంది ఆ అరుదైన చేపలను చూడటానికి ఆ బీచ్ వెంట పయనించారు.చివరికి కొందరు పరిశోధకులు ఆ చేపలను చూసి ఇది అరుదైన జాతికి చెందిన బ్లూ డ్రాగన్ చెప్పాలని వారు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ చేపలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు పెద్ద ఎత్తున షేర్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్గా మారాయి.ముందుగా ఈ చేపల్ని ఓ మహిళ చూడగా వాటిని వీడియో తీసి సముద్రంలో అందమైన హంతకి అనే క్యాప్షన్ ను జత చేసి వదిలింది.ఇక అంతే ఆ వీడియో వైరల్ గా మారిపోయింది.ఆ పోస్టు చూసిన ఎంతోమంది దగ్గర్లో ఉన్న వారు ఉన్న వ్యక్తులు వాటిని చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అయితే ఆవిడ ఆ చేపను చూడగానే అవి తనకు ఏమైనా హాని చేస్తాయి అనుకోని వాటి జోలికి వెళ్లలేదు.అయితే శాస్త్రవేత్తలు తెలిపిన దాని ప్రకారం ఆ చేపలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి.

కానీ, ఆ చేపలకు విషం కలిగి ఉంటుందని వారు తెలిపారు.అవి వేటాడే సమయంలో మిగతా జీవుల పై విషాన్ని ప్రయోగించి వాటిని వేటాడుతాయని వారు చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఈ చేపలకు కొన్ని ముళ్ళు ఉంటాయని వాటితో కూడా వేటాడుతాయని వారు తెలిపారు.అయితే ఇవి పొరపాటున మనుషులకు కుట్టిన మనిషికి ఆ ప్రాంతంలో దురద, నొప్పి లాంటివి వస్తాయని కాకపోతే.

ఎలాంటి ప్రాణ హాని సంభవించే పరిస్థితి లేదని పరిశోధకులు తెలిపారు.అయితే అక్కడి స్థానికులు మాత్రం ఇవి పక్షులు, రాకాసి బల్లులు, ఆక్టోపస్ లా ఉన్నాయని అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వెరైటీ చేపను చూసేయండి.

#Ocean #Fish #Social Media #Dragon Fish #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు