సుశాంత్‌ జ్ఞాపకార్థం సుశాంత్ మైనపు విగ్రహన్ని తయారు చేసిన శిల్పి సుకాంతో రాయ్‌...!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  మరణం వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అయన అభిమానులు అయితే సుశాంత్ మరణ వార్త ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.

 Bollywood Hero Sushanth Singh Rajput First Wax Statue,sushanth Death, West Benga-TeluguStop.com

అయితే ఇప్పటికి సుశాంత్ ఆత్మహత్య కేసు ఒక కొలిక్కి రాలేదు.ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ప్రస్తుతం డ్రగ్స్ కేసుగా మారింది.ఇంకా నిజా నిజాలు తెలియలిసి ఉంది.

ఆయన మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా సెలెబ్రిటీలు, అభిమానులు, సామాన్య ప్రజలు అందరు తమ దైన శైలిలో నివాళులు అర్పించారు.అయితే, ఒక అభిమాని మాత్రం సుశాంత్ కి ఎవరు ఊహించని విధంగా నివాళులు అర్పించాడు.

ఆ వివరాలలోకి వెళితే… పశ్చిమ బెంగాల్‌లోని అసనోల్స్ ‌కు చెందిన సుకాంతో రాయ్‌ అనే శిల్పి సుశాంత్‌ మీద ఉన్న అభిమానాన్ని గొప్పగా చాటుకున్నారు.తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మ్యూజియంలో సుశాంత్‌ జ్ఞాపకార్థం సుశాంత్ మైనపు విగ్రహాన్ని రూపొందించారు.

ఈ విషయంపై సుకాంతో రాయ్‌ మీడియాతో మాట్లాడుతూ.నేను సుశాంత్‌ను చాలా ఇష్టపడ్డాను.

సుశాంత్ కి ఒక గొప్ప అభిమానిని కూడా.సుశాంత్ అలా అనుకోకుండా ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా మృతిచెందడం నన్ను చాలా మానసిక వేదనకు గురిచేసింది.

అతనికి గుర్తుగా నా మ్యూజియం కోసం నేను ఈ మైనపు విగ్రహాన్ని తయారు చేశాను అని తెలిపారు.అయితే సుశాంత్‌ విగ్రహం కోసం అతని కుటుంబ సభ్యులు నన్ను సంప్రదిస్తే మరొక విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు అని తెలిపారు.

ఈ విగ్రహాన్ని ఆయన మీద అభిమానంతో నా మ్యూజియంలోనే ఉంచుకుంటాను అని తెలిపారు.  ఇంకో విషయం ఏంటంటే, గతంలో సుకాంతో రాయ్ బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో సహా మరి కొంతమంది ప్రముఖుల మైనపు విగ్రహాలను కూడా తయారుచేసారు.

అలాగే సుశాంత్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్ మ్యూజియంలో కూడా ఏర్పాటు చేయాలని అయన కోరాడు.సుకాంతో రాయ్‌ చేసిన ఈ మైనపు బొమ్మను చూసి నెటిజన్లు ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube