పురుషాంగం ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నవాడి పరిస్థితి ఏంటి

గత నెలలో అమెరికాకు చెందిన థామస్ మానింగ్ అనే 64 ఏళ్ల వృద్ధుడు పురుషాంగాన్ని ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాడు.ఈ విషయం మీద తెలుగుస్టాప్ ఇప్పటికే ఒక కథనాన్ని రాసింది.అతని అంగానికి క్యాన్సర్ సోకడంతో ఈ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది.15 గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ తరువాత పేషెంట్ ని తమవద్దే ఉంచుకున్నారు డాక్టర్లు.ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అంగాన్ని ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న తరువాత.

 First U.s. Penis Transplant Recipient Is Discharged From The Hospital-TeluguStop.com

నెల తరువాత మానింగ్ పరిస్థితిని పూర్తిగా గమనించారు వైద్యులు.అంగం దాకా రక్త ప్రసరణ బాగా జరుగుతుండటం విశేషం.అయితే, ఇప్పుడప్పుడే మానింగ్ శృంగార జీవితానికి పనికిరాడు.

మరికొన్ని నెలలు గడిస్తే తప్పా, ట్రాన్స్ ప్లాంట్ చేసిన అంగం సహజత్వం సంతరించుకోని శృంగారానికి సిద్ధమవుతుందా లేదా అనేది చెప్పలేం అని ప్రకటించారు డాక్టర్లు.

అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా, అంగం ఆరోగ్యంగా ఉండటానికి మానింగ్ ప్రతీరోజు కొన్నిరకాల మందులు వాడాల్సి వస్తుంది.

ఈ మందులు జీవితాంతం వాడాల్సిందే అంట.అయితే మూత్ర విసర్జన జరుగుతూ ఉండటం, ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ నడవగలుగుతూ ఉండటం చెప్పుకోదగ్గ విషయాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube