ట్రాన్స్ జెండర్స్ కు స్కూల్.... ప్రపంచంలో ఇలాంటి స్కూల్స్ కూడా ఉంటాయా!  

First Transgenders School In Chile-education,friends,general Telugu Updates,స్కూల్స్

గర్ల్స్ స్కూల్,బాయ్స్ స్కూల్, కో-ఎడ్యుకేషన్ ఇలా రకరకాల స్కూల్స్ గురించి వినివుంటాం. కానీ ఈ స్కూల్ గురించి వింటే మాత్రం ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఇలాంటి స్కూల్ ఒకటి ఉందా అని అనిపిస్తుంది. అలాంటి స్కూల్ ఒకటి చిలీ లో ఉంది..

ట్రాన్స్ జెండర్స్ కు స్కూల్.... ప్రపంచంలో ఇలాంటి స్కూల్స్ కూడా ఉంటాయా!-First Transgenders School In Chile

ఈ స్కూల్ ప్రత్యేకత ఏమిటంటే కేవలం ట్రాన్స్ జెండర్స్ కోసమే ఈ స్కూల్ నడుస్తుంది. దీని పేరు అమరాంటా స్కూల్. మెక్సికో ట్రాన్స్ జెండర్ రాజకీయ నాయకుడు ‘అమరాంటా గోమెజ్ రీగలాడో’ పేరునే ఈ స్కూలు కు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ స్కూల్ లో 6 నుంచి 17 ఏళ్ల వయసున్న ఎవరైనా ట్రాన్స్ జెండర్స్ చదువుకొనే అవకాశం ఉంటుంది. గతేడాదే ఈ స్కూల్ ని ప్రారంభించారు.

అయితే ఈ స్కూల్ లో మొత్తం 38 మంది విద్యార్థులు ఉండగా వారిలో 23 మంది ని మాత్రం ట్రాన్స్ జెండర్స్ గా గుర్తించారు.

మిగతా విద్యార్థులందరూ ట్రాన్స్జెండర్ పిల్లల స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు. ఇక్కడ చదువుతున్న వారందరూ ఈ ఏడాది స్టేట్ బోర్డ్ పరీక్షలు రాయబోతున్నారు. అయితే వారు మాట్లాడుతూ స్కూల్లో సాధారణ జీవితం గడిపుతున్నామని, ట్రాన్స్జెండర్గా ఉండడమంటే తమకు స్వేచ్ఛ ఉన్నట్టే అని పిల్లలు చెబుతున్నారు.

ఆ స్కూల్ ప్రిన్స్ పాల్ ఎవెలిన్ సిల్వా కూడా ఆడ,మగ అన్న తేడా నిజానికి అంట ముఖ్యం కాదు. కానీ పిల్లలు ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలానే స్వేచ్ఛగా ఉంటున్నారు అని అనుకుంటున్నా అని తెలిపారు. అలానే గతేడాది ఈ స్కూల్ లో చేరిన 17 ఏళ్ల మాటియో కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ స్కూలుకు అందే నిధులు ఆగిపోవడంతో, దాన్ని నడపడం కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఒక్కో విద్యార్థికి నెలకు ఏడు డాలర్ల ఫీజు కూడా వసూలు చేస్తున్నట్లు సమాచారం.