మొట్టమొదటి ట్రాన్స్ జెండర్..!

ట్రాన్స్ జెండర్ లకు ఈ సమాజంలో ఎటువంటి గౌరవం లభిస్తుందో అందరికీ తెలిసినదే.వారిని ఎంతో హేళనగా చేసి మాట్లాడటం, వారితో అవమానకరంగా ఉంటూ, ఎంతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు.

 First Trans Woman Doctor Trinetra Inspirational Story, First Transgender Women,-TeluguStop.com

ఇలాంటి ఎన్నో సమస్యలను ట్రాన్స్ జెండర్ లు ఎదుర్కొవడం మనం చూసే ఉంటాం.కానీ ఇలాంటి ఎన్నో అవమానాలను భరిస్తూ, కృంగిపోకుండా చదువుపై తన దృష్టి ఉంచి ఒక పెద్ద డాక్టర్ గా అరుదైన గౌరవాన్ని ట్రాన్స్ జెండర్ దక్కించుకున్నారు.

కర్ణాటకకు చెందిన త్రినేత్ర అసలు పేరు అంగద్ గుమ్మరాజు ఇతనిలో స్త్రీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల అతడు లింగ మార్పిడి చేయించుకుని ట్రాన్స్ ఉమెన్ గా మారారు.తన కూడా లింగమార్పిడి చేయించుకోక ముందు ఎన్నో అవమానాలను ఎదుర్కొనింది.

లింగమార్పిడి అనంతరం తన దృష్టిని మొత్తం చదువు పై ఉంచి బెంగళూరు వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు.కోర్సు పూర్తి అయిన అనంతరం త్రినేత్ర మణిపాల్ కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఇంటర్న్ షిప్ చేస్తోంది.

లింగ మార్పిడి చేయించుకున్న త్రినేత్ర ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో మొట్టమొదటి డాక్టర్ గా అరుదైన గౌరవం పొందింది.ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే త్రినేత్ర తన జీవితం ఆధారంగా ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందించారు.

ఈ సందర్భంగా తన జీవితంలో పడిన అవమానాలను, బాధలను మీడియాకు తెలియజేశారు.
తన ఇంటర్న్ షిప్ లో చేస్తున్న ఆసుపత్రిలో మొదటిసారి ప్రసవం చేసిన తర్వాత ఆ బిడ్డను తన చేతులలోకి ఎత్తుకున్నప్పుడు ఆ క్షణాలు మరుపురాని ఒక తీపి జ్ఞాపకంగా ఉందని త్రినేత్ర పేర్కొన్నారు.

ప్రస్తుత సమాజంలో ట్రాన్స్ జెండర్ లు అని బాధ పడే వారికి త్రినేత్రను స్ఫూర్తి గా తీసుకుంటే ఎవరు కూడా తాము ట్రాన్స్ జెండర్ అని బాధపడాల్సిన అవసరం ఉండదని చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం త్రినేత్ర ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలబడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube