వారు ఫస్ట్‌టైమ్‌ డేట్‌కి వెళ్లారు.. ఫ్రెండ్స్‌ ఏం చేశారంటే?  

friends, couple first date, engagement celebration, Couple first date celebrations by friends - Telugu Couple First Date, Couple First Date Celebrations By Friends, Engagement Celebration, Friends

ఓ జంట తొలిసారి డేటింగ్ కి వెళ్లారు.ఆ డేట్ వారికీ జీవితాంతం గుర్తుండిపోయేలా వారి ఫ్రెండ్స్ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు.

 First Time Couple Date Celebrations

ఆ సర్ప్రైజ్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.అంత అద్భుతంగా ఉంది ఆ సర్‌ప్రైజ్.

ఇంకా ఆ సర్ప్రైజ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వారు ఫస్ట్‌టైమ్‌ డేట్‌కి వెళ్లారు.. ఫ్రెండ్స్‌ ఏం చేశారంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

అసలు ఆ సర్‌ప్రైజ్ ఏంటి? వారి ఫ్రెండ్స్ ఎం ఇచ్చారు అనేది ఇక్కడ చూద్దాం! నార్త్ ఐర్లాండ్‌లోని డెర్రీకి చెందిన నీల్ హర్కిన్, జీన్ మెక్‌ఆలే అనే ఇద్దరు చిన్నప్పటి నుండి స్నేహితులు.ఒకరినొకరు ఇష్టపడ్డారు.ఇటీవలే మొదటిసారి డేట్ కి వెళ్ళాలి అనుకున్నారు.దీంతో అక్కడ లండన్డెరీలోని ఓల్డ్ డాక్స్ బార్‌కి వెళ్లారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ హోటల్ యజమాని, హర్కిన్‌ ప్రాణస్నేహితుడు లియామ్ షీల్స్ వారి ఫస్ట్‌డేట్‌ను జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంలా సెలబ్రేట్ చెయ్యాలి అనుకున్నారు.

పథకం ప్రకారం వారికీ తెలియకుండా సెంట్రల్‌లో ఓ టేబుల్‌ వేయించి, మిగిలిన టేబుల్స్ పై వారి స్నేహితులను కూర్చోబెట్టారు.

దీంతో వారు సెంట్రల్‌ టేబుల్ వద్ద వచ్చి కూర్చున్నారు.

డిన్నర్ కూడా చేశారు.తిరిగి వెళ్లే సమయంలో ఓ వెయిటర్ వచ్చి భారీ స్పార్క్లర్‌తో పాటు ప్రాసికో బాటిల్‌ తెచ్చి పెట్టారు.

దీంతో రెస్టారెంట్‌లోని ఇతర డైనర్లు చప్పట్లు కొడుతూ వారికీ శుభాకాంక్షలు తెలిపారు.దీంతో ఒక్కసారిగా షాక్ అయినా వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

ఇంకా ఈ ఘటన అంత వీడియో తీశారు.దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Friends

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

First Time Couple Date Celebrations Related Telugu News,Photos/Pics,Images..