సూర్య గ్రహణం రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే?

ఈ ఏడాది మొట్టమొదటిసారిగా సూర్యగ్రహణం జూన్ 10 తేదీన ఏర్పడనుంది.ఈ సూర్యగ్రహణం కేవలం పాక్షికంగా ఏర్పడటం వల్ల ఈ సూర్యగ్రహణం ప్రభావం అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

 The First Solar Eclipse On June 10 Avoid These Mistakes , Do These Mistakes, Dur-TeluguStop.com

అమావాస్య రోజున చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య పడినప్పుడు ఆ స్థానాన్ని సూర్యగ్రహణం అంటారు.జూన్ 10వ తేదీ ఏర్పడే సూర్య గ్రహణం 94 శాతం చంద్రుడు రావడం వల్ల కేవలం రింగు ఆకారంలో మాత్రమే మనకు కనిపిస్తాడు.

ఈ విధంగా రింగు ఆకారంలో గ్రహణం ఏర్పడటాన్ని రింగ్ ఆఫ్ ఫైర్, కంకనాకృతి సూర్య గ్రహణం అని పిలుస్తారు.

ఈ విధమైనటువంటి సూర్య గ్రహణం ఏర్పడటంవల్ల ఈ సూర్యగ్రహణం ప్రభావం కొన్ని రాశుల వారిపై అధికంగా ఉంటుంది.

ముఖ్యంగా వృషభ రాశి వారి పై సూర్య గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది.జూన్ 10 వ తేదీన సూర్య గ్రహణం మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:41 గంటలకు ముగుస్తుంది.ఈ సూర్యగ్రహణానికి 12 గంటల ముందు ఖననం ప్రారంభమవుతుంది.అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో మినహా మిగిలిన దేశాలలో కనబడుతుంది.

ఈ విధంగా సూర్య గ్రహణం ఏర్పడే సమయంలో ఎన్నో జాగ్రత్తలను పాటించాలి.పొరపాటున కూడా కొన్ని పనులను అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

మరి ఆ పొరపాటు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

గ్రహణం సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉపవాసంతో ఉండాలి.

Telugu Grahan, Solar Eclipse, Pooja-Telugu Bhakthi

గ్రహణ సమయంలో ఎవరూ కూడా పూజలు చేయకూడదు.ఈ గ్రహణం ఏర్పడే సమయంలో ఎవరూ కూడా నేరుగా సూర్యుని చూడకూడదు.ఈ విధంగా చూడటం వల్ల సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు మన కాళ్ళపై పడి తీవ్ర ప్రమాదాలకు కారణం అవుతాయి.

ముఖ్యంగా స్త్రీలు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను సేవించకుండా బయటకు రాకుండా జాగ్రత్త పడాలి.మనదేశంలో సూర్యగ్రహణ ప్రభావం లేకపోయినప్పటికీ గర్భిణీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

గ్రహణ సమయములో కత్తులు, కత్తెర వంటి వస్తువులను ఉపయోగించరాదు.ఈ విధంగా గ్రహణం రోజు ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube