ప్రేమికుల రోజు ఏయ్ పిల్లా అంటూ సాంగ్ ఏసుకుంటున్న సాయి పల్లవి-చైతూ  

First Single Release On Lover Day From Love Story Movie-love Story Movie,naga Chaithanya,sai Pallavi,sekhar Kammula,tollywood

ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయి పల్లవి.మొదటి సినిమాతోనే తన తెలంగాణ యాస్, పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలిచిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఫాన్స్ ని సొంతం చేసుకుంది.

First Single Release On Lover Day From Love Story Movie-Love Movie Naga Chaithanya Sai Pallavi Sekhar Kammula Tollywood

ఈ నేపధ్యంలో సాయి పల్లవి సినిమా అంటే ఆసక్తిగా ఎదురుచూసే వారు టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్నారు.ఇదే సమయంలో ఆమె సినిమా అంటే కచ్చితంగా సాయి పల్లవి డాన్స్ చూడటానికి కూడా సౌత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు.

ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన పాటలు ప్రస్తుతం యుట్యూబ్ లో సంచలన సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ అనే సినిమా చేస్తుంది.

ఈ సినిమాలో నాగ చైతన్యతో ఈ అమ్మడు రొమాన్స్ చేయబోతుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి దర్శకుడు ఇంటెన్సన్ క్రియేట్ చేశాడు.

ఇది కూడా మరో ఫీల్ గుడ్ మూవీలా ఉండబోతుంది అనే శేఖర్ కమ్ముల చెప్పకనే చెప్పేసాడు.ఇదిలా ఉంటే ప్రేమికుల రోజు సందర్భంగా ఈ లవ్ స్టొరీ నుంచి ఓ సాంగ్ ని తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నారు.

ఫిబ్రవరి 14న ఉదయం లవ్ స్టొరీ నుంచి ఏయ్ పిల్లా అనే సాంగ్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.మరి ఈ సాంగ్ తో ఫిదా భామ మరో సారి ప్రేక్షకులని ఫిదా చేస్తుందేమో చూడాలి.

అయితే ఫిదాలో సాయి పల్లవి తెలంగాణ మాండలికం మాట్లాడితే ఇందులో చైతు మాట్లాదబోతున్నట్లు తెలుస్తుంది.

.

తాజా వార్తలు

First Single Release On Lover Day From Love Story Movie-love Story Movie,naga Chaithanya,sai Pallavi,sekhar Kammula,tollywood Related....