వ్యాక్సిన్ ప్ర‌భావంపై అంద‌రూ తెలుసుకోవాల్సిన న్యూస్ చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: క‌రోనా వ్యాక్సిన్ ప్రభావంపై ప్రజలు వీక్లీ అప్‌డేట్‌లను తెలుసుకునేందుకు వీలు కల్పించే కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది.దీనివ‌ల‌న వ్యాక్సిన్ వేసుకున్న‌వారికి, వ్యాక్సిన్ వేసుకోనివారికి మ‌ధ్య త‌లెత్తే క‌రోనా మ‌ర‌ణాల రేటును ప్ర‌జ‌లు స్ప‌ష్టంగా తెలుసుకోగ‌లుగుతారు.ఏప్రిల్ 18 నుంచి ఆగస్టు 16 వరకు ల‌భ్య‌మైన డేటా ప్రకారం వ్యాక్సిన్ మొదటి మోతాదు తీసుకున్న‌వారిలో మరణ ప్రమాదాన్ని 96.6 శాతం, రెండో మోతాదును తీసుకున్న‌వారిలో 97.5 శాతం తగ్గిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెడ్ బల్‌రామ్‌ భార్గవ తెలిపారు.

 First Shot Of Covid Vaccine Lowers Risk Of Mortality By 96 Percent Second One By-TeluguStop.com

మే నెలలో ప్రతిరోజూ సుమారు 20 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పుడు సెప్టెంబర్ లో ఈ సంఖ్య 75 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని పేర్కొంది.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంద‌ని తెలిపింది.కాగా గ‌డ‌చిన 24 గంటల్లో 86 లక్షల టీకాలు వేశారు.దేశంలో కరోనా సెకెండ్ వేవ్‌ ఇప్పటికీ కొనసాగుతున్న‌ద‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది.

లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్న ఏకైక రాష్ట్రం కేరళ అని ఆరోగ్య కార్యదర్శి వెల్ల‌డించారు.దేశంలోని ప్ర‌స్తుతం ఉన్న మొత్తం కరోనా కేసుల్లో 61శాతం కేసులు కేర‌ళ‌లోనే ఉన్నాయి.

ప్రస్తుతం మొత్తం 3 లక్షల 93 వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.కేరళలో 2 లక్షల 40 వేలకు పైగా కేసులు ఉండగా, మహారాష్ట్రలో 51,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube