ఏపీ పంచాయతీ ఎన్నికల తొలి షెడ్యూల్..!!

స్థానిక సంస్థల ఎన్నికలు చుట్టూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరుగుతున్నాయి అన్న సంగతి తెలిసిందే.పంచాయతీ ఎన్నికలు ఏదోవిధంగా నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుబడుతుండగా మరోపక్క ప్రభుత్వం ఎన్నికల తర్వాత నిర్వహించే ఆలోచన చేస్తూ ఉంది.

 Nimagadda Ramesh Kumar,suprem Court,high Court,andhra Pradesh.nimmagadda Ramesh-TeluguStop.com

ఇదిలా ఉంటే హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల తొలి దశ షెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేశారు.

విడుదలైన షెడ్యూల్ సమాచారం ప్రకారం జనవరి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, జనవరి 27 నామినేషన్ల దాఖలుకు తేదీ గడువు గా, అదేవిధంగా నామినేషన్ల పరిశీలన జనవరి 28 తర్వాత నామినేషన్ల పై వచ్చిన అభ్యంతరాలు జనవరి 29 వరకు రాష్ట్ర ఎన్నికల బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఇక జనవరిలో జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకునే జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఎన్నికల బోర్డు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.ఇక తొలి దశ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు <వెల్లడించడానికి రాష్ట్ర ఎన్నికల బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగింది.దీంతో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అని ఉత్కంఠ ఒకపక్క అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న టెన్షన్ మరోపక్క ఏపీలో నెలకొంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube