మిల్కీ బ్యూటీ తొలి సంపాదన ఎంతో తెలుసా?

తమన్నా. మిల్కీ బ్యూటీగా తెలుగు జనాల మదిలో నిలిచిపోయింది.

 First Remuneration Of Tollywood Heroine Tamannah, Tamannah, Milky Beauty, Tamanna Bhatia, Tamanna First Remuneration, Tamanna First Remuneration, Syeraa, Badrinath, Happydays, Ad Shooting, One Lakh Remuneration-TeluguStop.com

శ్రీ సినిమాలో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.కేవలం 15 ఏండ్ల వయసులోనే మంచు మనోజ్ తో ఆడిపాడింది ఈ క్యూట్ బ్యూటీ.

శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాతో హిట్ కొట్టింది.అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 First Remuneration Of Tollywood Heroine Tamannah, Tamannah, Milky Beauty, Tamanna Bhatia, Tamanna First Remuneration, Tamanna First Remuneration, Syeraa, Badrinath, Happydays, Ad Shooting, One Lakh Remuneration-మిల్కీ బ్యూటీ తొలి సంపాదన ఎంతో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా తర్వాత తను వెను తిరిగి చూసుకోలేదు.గతేడాది చిరంజీవి సైరా సినిమాలోనూ నటించింది.ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.15 ఏండ్లుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఎంజాయే చేస్తున్న తమన్నా.ప్రస్తుతం సినిమాకు కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

ప్రస్తుతం హీరోయిన్లు 5 ఏండ్లు స్టార్ డమ్ ఉంటేనే ఓ రేంజిలో ఫీలవుతున్నారు.అలాంటిది తమన్నా.15 ఏండ్లుగా టాప్ స్టార్ గానే కొనసాగుతోంది.ఇంకా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ప్రస్తుతం తన చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి.ఒక్క తెలుగులోనే కాదు.మిగతా సినిమా పరిశ్రమల్లోనూ తనకు అభిమానులున్నారు.

లాక్ డౌన్ సమయంలోనూ తన దగ్గరకు పలు కథ వచ్చాయి.

పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే తమన్నా సినిమాల్లోకి వచ్చేసింది.

Telugu Ad, Badrinath, Happydays, Milky, Syeraa, Tamanna, Tamannah-Telugu Stop Exclusive Top Stories

ఈ విషయం గురించి తాజా తమన్నా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది.తొలి సినిమాలో అందుకున్న పారితోషికం విషయాన్ని కూడా తను రివీల్ చేసింది.సినిమాల్లోకి రాక ముందు తమన్న ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది.ఓ వైపు పదో తరగతి పరీక్షలు రాస్తూనే.తను ఈ యాడ్ లో నటించింది.పొద్దున్నే ఎగ్జామ్.

మధ్యాహ్నం యాడ్ షూటింగ్.మూడు రోజుల పాటు ఇదే తంతు కొనసాగింది.2005లో జరిగిన ఈ యాడ్ ద్వారా తను లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెప్పింది.ఆ డబ్బుతోనే తన ఫ్యామిలీని కాఫీ షాప్ కు తీసుకెళ్లినట్లు చెప్పింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube