బర్త్ డే సందర్భంగా 'మహాసముద్రం' లో అనూ ఫస్ట్ లుక్ విడుదల..!

మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనూ ఇమ్మాన్యూల్ ఆ సినిమా హిట్ తో వరుస ఆఫర్లను దక్కించుకుంది.కానీ ఈ అమ్మడికి టైం కలిసిరకలేదు.

 First Look Poster Of Anu Emmanuel From Maha Samudram Revealed, Anu Emmanuel, Bi-TeluguStop.com

అందం అభినయం ఉన్నా కూడా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయింది.అను కు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చిన ఆ సినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో రేస్ లో వెనుక బడింది.

అను చేసిన నా పేరు సూర్య, అజ్ఞాతవాసి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు అంతగా మెప్పించకపోవడంతో అవకాశాలు తగ్గాయి.ఈ సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయినా ఈ అమ్మడి లెవెల్ వేరేగా ఉండేది.

అయితే స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోయినా కుర్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం అను మహాసముద్రం సినిమా చేస్తుంది.

ఈ రోజు అను ఇమ్మాన్యూల్ బర్త్ డే సందర్భంగా మహాసముద్రం టీమ్ అనుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.ఈ లుక్ అభిమానులకు తెగ నచ్చింది.ఆ పిక్ లో సింపుల్ గా నవ్వుతూ ఒక కెఫెలో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపించింది.ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో శర్వానంద్, సిద్దార్ధ హీరోలుగా నటిస్తున్నారు.

సిద్దార్ధ చాలా రోజుల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి.ఈ సినిమాతో నైనా అను ఒక మంచి హిట్ కొట్టి స్టార్ స్టేటస్ అందుకోవాలని చూస్తుంది.

మరి అజయ్ భూపతి అను కు మంచి హిట్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.ఈ సినిమాను ఆగస్టు 19 న విడుదల చేయబోతున్నారు.

https://twitter.com/AKentsOfficial/status/1376028972060790786/photo/1

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube