ఫస్ట్‌లుక్‌ సూపర్‌

మంచు లక్ష్మి హీరోయిన్‌గా, నిర్మిస్తున్న సినిమా ‘దొంగాట’.ఈ సినిమాలో మంచు లక్ష్మి సినిమా స్టార్‌గా కనిపించనున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పిన విషయం తెల్సిందే.

 First Look: Manchu Lakshmi’s Dongata-TeluguStop.com

ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు.ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది.

వైవిధ్యభరితంగా ఈ ఫస్ట్‌లుక్‌ ఉండటంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అడవి శేషు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలోని ఒక పాటలో టాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు కనిపించనున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఆ పార్టీ సాంగ్‌లో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, మాస్‌ మహారాజ రవితే, రానా, నాగచైతన్య, జీవ, శింబు, మంచు విష్ణు, ఆది ఇంకా పలువురు కనిపించనున్నారు.రానా కొన్ని సీన్స్‌లో కూడా కనిపించనున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో జరిగే ఒక నేరం నేపథ్యంలో ఈ సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించినట్లుగా దర్శకుడు వంశీ కృష్ణ చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube