ఈ వందేళ్ల ఫ్యాషన్ డాల్ గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతారంతే..!

అమెరికన్ వ్యాపారవేత్త, ఇంటీరియర్ డిజైనర్‌గా రాణించిన ‘ఐరిస్ అప్‌ఫెల్’ ఫ్యాషన్ ప్రపంచంలోనూ చెక్కుచెదరని గుర్తింపు తెచ్చుకుంది.ఈమె ఫ్యాషన్ ఐకాన్‌గా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచింది.

 First Lady Of Fabric Iris Apfel Turns 100-TeluguStop.com

ఆగస్టు 29న వందేళ్లు పురస్కరించుకుని ఫ్యాషన్ రంగంలో చరిత్ర సృష్టించింది.ఈమె 1921న న్యూయార్క్‌లోని ‘ఐరిస్ బారెల్’ అనే ఒక యూదు కుటుంబంలో పుట్టింది.

ఆమె తండ్రి శామ్యుల్ బారెల్ వ్యాపారవేత్త కాగా.తల్లి సద్యే ఫ్యాషన్ బోటిక్ కంపెనీ నడిపేవారు.

 First Lady Of Fabric Iris Apfel Turns 100-ఈ వందేళ్ల ఫ్యాషన్ డాల్ గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతారంతే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో ఐరిస్ అప్‌ఫెల్ లో ఫ్యాషన్‌పై, పాత వస్త్రాలు, వస్తువులపై మిక్కిలి ఇష్టం పెరిగిపోయింది.

1940లో కార్ల్‌ అనే వ్యక్తిని అప్‌ఫెల్ పెళ్లి చేసుకుంది.భర్త అండతో ‘ఓల్డ్ వరల్డ్ వీవర్స్’ అనే టెక్స్‌టైల్ సంస్థను స్థాపించి ఓల్డ్ దుస్తులను కొత్త దుస్తులుగా మార్చడం మొదలుపెట్టింది.వైట్ హౌస్‌తో ఒప్పందం కుదుర్చుకుని అధ్యక్షులతో పని చేసే అవకాశం దక్కించుకుంది.

తన అద్భుతమైన ప్రతిభతో ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఫ్యాబ్రిక్’, ‘అవర్ లేడీ ఆఫ్ క్లాత్’ అనే బిరుదులను కూడా సంపాదించుకుంది.

అప్‌ఫెల్ దంపతులు ఫ్యాషన్ రంగంలో ట్రెండ్ సెట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు.అప్‌ఫెల్ సేవలను 2015లో ‘ఐరిస్’ అనే డాక్యుమెంటరీ పేరుతో ప్రజలకు తెలియజేయగా ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది.2018లో బొమ్మల తయారీ కంపెనీ “మాట్టెల్” ఆమెను పోలిన ఒక బార్బీ డాల్ తయారు చేసి ఆమె ఖ్యాతిని మరింత పెంచింది.17, 18, 19 వ శతాబ్దాల నాటి ఫాబ్రిక్ ను నేటి ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా మలచగల నైపుణ్యం అప్‌ఫెల్ సొంతం.ఈమెకు న్యూయార్క్‌ మాన్‌హట్టన్‌లోని 115 ఈస్ట్ 57వ వీధిలో షోరూమ్ ఉంది.

ఈమె 1940 కాలం నుంచి ఫ్యాషన్ పరిశ్రమలో ఓ ఐకాన్‌గా వెలుగొందింది.ఆమె కలర్ ఫుల్ దుస్తులు, గాజులు, జ్యువలరీ అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి.

#Iris Apfel #Carl Apfel #Iris Apfel #LadyFabric #LadyFabric

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు