అమెరికా ప్రధమ మహిళకి కరోనా టెస్ట్....ఎం తేలిందంటే...???  

First Lady Melania Trump Coronavirus Negative - Telugu America, Coronavirus, First Lady, Melania Trump, Negative

అమెరికా ప్రపంచ దేశాలని గడగడలాడిస్తుంటే.అమెరికాని మాత్రం కరోనా గడగడలాడిస్తోంది.

 First Lady Melania Trump Coronavirus Negative - Telugu America

ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 600 మందికి పైగానే మృత్యువాత పడ్డారని, సుమారు 50000 మార్క్ కి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలుస్తున్న నేపధ్యంలో అమెరికా వ్యాప్తంగా ప్రజలు బిక్క బిగుసుకు పోతున్నారు.కరోనా వైరస్ ని అరికట్టడానికి ఇప్పటి వరకూ ట్రంప్ చేపడుతున్న చర్యలు అన్నీ సక్సెస్ అవుతున్నా.

ముందుగానే కరోనాని కట్టడి చేయడంలో విఫలం అవ్వడంతో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు…ఇదిలాఉంటే

 First Lady Melania Trump Coronavirus Negative - Telugu America

కరోనా ఉండనే కంగారుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని రోజుల క్రితమే వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం అందరికి తెలిసిందే.ఎంతో హై డ్రామా మధ్య ట్రంప్ కి కరోనా పరీక్షలు చేశారు.

ఆ తరువాత ట్రంప్ కి కరోనా గిరోనా లేదంటూ ప్రకటించారు.కొన్ని రోజుల క్రితమే వైట్ హౌస్ లో ఓ ఉన్నత అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో హై అలెర్ట్ అయిన వైట్ హౌస్ యంత్రాంగం అందరికి కరోనా టెస్ట్ లు చేసేసింది.ఈ క్రమంలోనే…తాజాగా

ట్రంప్ సతీమణి, అమెరికా ప్రధమ మహిళ అయిన మెలానియా కి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఆమెకి ఈ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఆమెకి కరోనా పరీక్షలు చేసిన విషయాన్ని వైట్ హౌస్ సిబ్బంది ప్రకటించారు.మెలానియా ఆరోగ్యం బాగానే ఉందని, నేరుగా ట్రంప్ ప్రకటించడంతో పలు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ మార్చి 13 న కరోనా టెస్ట్ లు చేయించుకున్నారు కదా అప్పుడే మెలానియా చేయించుకోలేదా.?? ఇప్పుడు ఎందుకు అత్యవసరంగా ఈ పరీక్షలు అంటూ అనుమానాలు రేకెత్తిస్తున్నారు నెటిజన్లు.

తాజా వార్తలు

First Lady Melania Trump Coronavirus Negative Related Telugu News,Photos/Pics,Images..