‘‘ స్పెల్లింగ్ - బీ’’ ఫైనల్స్‌: గెస్ట్‌గా జిల్ బైడెన్... బాలల ప్రతిభను తిలకించనున్న అమెరికా ఫస్ట్ లేడీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఈ నెల 8న ఒర్లాండోలో జరిగే ‘‘స్పెల్లింగ్‌-బీ’’ ఫైనల్ పోటీలకు అతిథిగా హాజరుకానున్నారు.ఈ పోటీల్లో 11 మంది చిన్నారులు ఫైనల్స్‌కు చేరగా.

 First Lady Jill Biden To Attend Us Spelling Bee 9 Indian-americans In Finals, Sp-TeluguStop.com

వీరిలో 9 మంది భారత సంతతి బాలలే వున్న సంగతి తెలిసిందే.ఫైనల్స్‌ ప్రారంభం కావడానికి ముందు ఈ 11 మంది చిన్నారులు, వారి కుటుంబ సభ్యులను జిల్‌బైడెన్ కలవనున్నారు.

ఇందుకు సంబంధించి మంగళవారం శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది.జిల్ బైడెన్ గతంలో 2009లో జరిగిన స్పెల్లింగ్-బీ ఫైనల్స్‌కు హాజరయ్యారు.1925 నుంచి జరుగుతున్న స్పెల్లింగ్‌-బీ పోటీల్లో గత 20ఏళ్లుగా భారత సంతతి చిన్నారులే ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే.2020లో జరగాల్సిన స్పెల్లింగ్‌ బీ పోటీలు కరోనా ఉద్ధృతి కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.2019లో జరిగిన స్పెల్లింగ్ బీ పోటీల్లో 8 మంది కో ఛాంపియన్లుగా నిలవగా.వారిలో ఏడుగురు భారత సంతతి చిన్నారులే కావడం గమనార్హం.1999 నుంచి జరుగుతున్న ఈ పోటీల్లో ఇప్పటి వరకు 26 మంది ఇండో-అమెరికన్‌ చిన్నారులు ఛాంపియన్లుగా అవతరించారు.

కాగా, జూలై 8 న జరగున్న స్పెల్లింగ్ బీ ఫైనల్స్‌ను ఈఎస్పీఎన్‌-2 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

చివరి అంకంలో న్యాయనిర్ణేతలు అడిగిన పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్‌ను క్షణాల్లో చెప్పాల్సి వుంటుంది.ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్ సంస్థ 50 వేల డాలర్లు నగదు బహుమతి, మెడల్‌, ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ ఇవ్వనుంది.

అలాగే మెరియమ్‌ -వెబ్‌స్టర్‌ డిక్షనరీ వారు 2,500 డాలర్లు.కొన్ని పుస్తకాలు బహుకరిస్తారు.దీనితో పాటు బ్రిటానికా సంస్థ 400 డాలర్లు విలువ చేసే పుస్తకాలు, మూడేళ్లపాటు బ్రిటానికా ఆన్‌లైన్‌ ప్రిమియమ్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ఇవ్వనుంది.

Telugu Espn Channel, Indo American, Jill Biden, Merriamwebsters-Telugu NRI

స్పెల్లింగ్‌ బీ -2021 ఫైనల్‌కు చేరిన చిన్నారులు వీరే.

రాయ్‌ సెలిగ్మన్‌(12) – (ది బహమాస్‌), భావన మదిని (13) – (న్యూయార్క్‌), శ్రీతన్‌ గాజుల (14) – (నార్త్‌ కరోలినా), ఆశ్రిత గాంధారి (14) – (వర్జినియా), అవనీ జోషి (13) – (ఇల్లినాయిస్‌), జైలా అవంత్‌ గార్డే (14) – (న్యూ ఓర్లియన్స్‌), వివిన్షా వెదురు(10) – (టెక్సాస్‌), ధ్రువ్‌ భారతీయ (12) – (డల్లాస్‌), విహాన్‌ సిబల్‌ (12) – (టెక్సాస్‌), అక్షయినీ కమ్మ(13) – (టెక్సాస్‌), ఛైత్ర తుమ్మల (12) – (శాన్‌ఫ్రాన్సిస్కో)

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube