భారతీయ మహిళ రికార్డ్ క్రియేట్ చేసింది..!!!  

First Indian Woman Scientist In London\'s Royal Society-gagandeep Kang,london\\'s Royal Society,woman Scientist,తమిళనాడు,రోటా వైరస్

లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత రాయల్ సొసైటీ సైంటిఫిక్ అకాడమీలో తొలిసారిగా ఒక భారతీయ మహిళ స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకూ భారత సంతతి మహిళలు ఈ అకాడమీలో స్థానం లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది పరిసోధనల్లో విశేష సేవలు అందించినందుకు గాను సుమారు 51 మంది శాస్త్రవేత్తల జాబితాలో తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్ కాలేజీ వైద్య పరిశోధకురాలికి ఈ ఘనత దక్కింది..

భారతీయ మహిళ రికార్డ్ క్రియేట్ చేసింది..!!!-First Indian Woman Scientist In London's Royal Society

ఆమె పేరు గగన్ దీప కాంగ్.

చిన్నారుల్లో వచ్చే రోటా వైరస్ పై చేస్తున్న పరిశోధనలకి గాను ఆమెకి ఈ గుర్తింపు లభించింది. అంతేకాదు ఈ రాయల్‌ సొసైటీ ఎంపిక చేసిన శాస్త్రవేత్తల జాబితాలో మరో ముగ్గురు భారత సంతతి శాస్త్రవేత్తలు కూడా చోటు దక్కించుకున్నారు..

వారిలో ఒకరు అమెరికన్ –కెనడియన్ గణిత పరిశోధకులు మంజుల్‌ భార్గవ కాగా ,ఆస్ర్టేలియన్‌ గణిత పరిశోధకులు అక్షయ్‌ వెంకటేశ్‌, బ్రిటీష్ మైక్రోబయాలజిస్ట్ గుర్ద్యాల్‌ బెస్రా కూడా ఉన్నారు.

వరుసగా నలుగురు భారతీయులు ఈ అకాడమీలో చోటు దక్కించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నారైలు.