అమెరికాలో ఫెడరల్ జడ్జిగా ఇండో అమెరికన్ మహిళ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండో అమెరికన్ మహిళ కి న్యాయమూర్తిగా కీలక భాద్యతలు అప్పగిచారు.ఈ మేరకు ఉత్తర్వులని జారీ చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో సంచలనం సృష్టించింది.

 First Indian American Woman Women Nominated Us Federal Court Judge-TeluguStop.com

న్యాయవాదిగా ఉన్న ప్రవాస భారతీయురాలైన షిరీన్ మ్యాధ్యూస్ వైట్ కాలర్ నేరాల దర్యాప్తులో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి.అంతేకాదు ఆమె జోన్స్ డే అనే న్యాయ సంస్థకి భాగస్వామిగా కూడా ఉన్నారు.

షిరీన్ గతంలో కాలిఫోర్నియా అసిస్టెంట్ ఫెడరల్ జడ్జి గ కూడా వ్యవహరించారు.క్రిమినల్ హెల్త్ కేర్ ఫ్రాడ్ కేసులని విచారించే వారు.ఎన్నో కేసులని సులువుగా చేధించడంలో ఆమె కీలక పాత్ర పోషిచారు దాంతో ఆమెని ట్రంప్ అన్ని కోణాలలో పరిశీలించే ఆమె ఈ పదవికి సమర్దురాలని భావించి ఈ కీలక పదవికి ఎంపిక చేసినట్టుగా స్థానిక మీడియా తెలిపింది.

Telugu Indianamerican, Trump Nominates, Federal Judge-

సాన్ డీగో లో సదర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో ఆమె ఈ ఉన్నతమైన పదవిని అలంకరించనున్నారని ప్రభుత్వం తెలిపింది.ఆమె ఆ పదవిని అలంకరించడానికి ఇంకా సెనేట్ తన ఆమోదాన్ని తెలపాల్సి ఉంది.అయితే ఎంపిక చారిత్రాత్మకమని సౌత్ ఏషియా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనీష్ తెలిపారు.

ఈ మధ్య కాలంలో భారత సంతతికి చెందిన నలుగురిని ట్రంప్ జడ్జిలు గా నియమించారు.కాగా షిరీన్ ఐదవ వ్యక్తి కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube