కరోనాకి వాక్సిన్ వచ్చింది... ట్రయిల్ చేయించుకున్న మొట్టమొదటి వ్యక్తి

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19)కు మందు కనిపెట్టే ప్రయత్నం అన్ని దేశాలలో జరుగుతుంది.ఎవరికీ వారు తమ శక్తి మేరకు వాక్సిన కనిపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

 First Human Trial Of A Vaccine To Protect Against Pandemic Corona Virus-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ముందడుగు వేసింది.కరోనా వైరస్ కి వాక్సిన్ ని తయారు చేసి చేసి తొలి ట్రయల్‌గా ఓ మహిళపై ప్రయోగించింది.

సియాటిల్‌కు చెందిన 43 ఏళ్ళ మహిళ హాల్లెర్‌పై వాక్సిన్‌ను తొలిసారి ప్రయోగించామని అమెరికా అధికారికంగా ప్రకటించింది.అదే మహిళకు రెండో ఇంజెక్షన్‌ కూడా ఇచ్చామని స్పష్టం చేసింది.

క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా హాల్లెర్‌కు రెండు ఇంజెక్షన్లు చేయడం జరిగింది.మార్చి 16వ తేదీన కరోనా వాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించామని, సియాటిల్‌లోని కైజర్ పెర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఈ ప్రయోగం జరిగిందని అమెరికా వివరించింది.

పూర్తిగా ఆరోగ్యంగా వున్న మొత్తం 45 మందిని సియాటిల్ లేబొరేటరీ ఎంపిక చేసి వారిలో జెన్నిఫర్ హాల్లెర్ కి మొదటిగా ప్రయోగించింది.కరోనా వైరస్ వాక్సిన్‌ను తొలిసారి తీసుకున్న జెన్నీఫర్ హాల్లెర్… కరోనాపై ప్రపంచం ఏమీ చేయలేక చతికిలా పడిన సందర్భంలో తనకు ఈ అవకాశం దక్కడం ఆనందంగా వుందని వెల్లడించింది.

ప్రయోగంలోను భాగస్వామిగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube