తొలిసారిగా 'మెటావర్స్'లో పెళ్లి రిసెప్షన్.. భారత వధూవరులు వినూత్న ప్రయత్నం..!

మొన్నటిదాకా డిజిటల్ పద్ధతిలో పెళ్లి చూపులతో పాటు పెళ్లిళ్లు కూడా జరిగి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.కరోనా సమయంలో కొన్ని పెళ్లిళ్లలో ఆన్‌లైన్‌ ద్వారానే బంధు మిత్రులు హాజరయ్యారు.

 First Ever Metaverse Wedding Reception To Be Held By Tamilnadu Couple Dinesh Jan-TeluguStop.com

అయితే ఇప్పుడు ఓ తమిళనాడు జంట దీనికి మించిన లెవల్లో తమ పెళ్లిని ప్లాన్ చేశారు.తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌గా వ్యవహరిస్తున్న టెక్నాలజీ ఎక్స్‌పర్ట్ దినేష్‌ క్షత్రియన్‌ అనే వ్యక్తి జనగనందిని అనే యువతిని త్వరలోనే వివాహం చేసుకోనున్నారు.

వీళ్లు తమ పెండ్లిని ఒక గ్రామంలో ప్లాన్ చేశారు.అలాగే ప్రపంచవ్యాప్తంగా తమకున్న బంధుమిత్రులందరినీ రిసెప్షన్ కు పిలవాలి అని అనుకున్నారు.

కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అది సాధ్యం కాదని భావించారు.అందుకే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అది ఏంటంటే, ‘మెటావర్స్‌’ అనే వర్చువల్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌లో పెళ్లి రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలనుకున్నారు.బంధుమిత్రులు ఈ వర్చువల్‌ పద్ధతిలో దినేష్‌, జనగనందిని పెళ్లి రిసెప్షన్ కి త్వరలోనే హాజరు కాబోతున్నారు.

అయితే తొలిసారిగా ఇలా వెడ్డింగ్ రిసెప్షన్ మెటావర్స్‌ అనే వర్చువల్‌ పద్ధతిలో నిర్వహిస్తుండటం విశేషం.ఇప్పటికే ఈ వధూవరులు తమ అవతార్ల ద్వారా వర్చువల్ గా కలుసుకున్నారు.

అయితే ఈ వర్చువల్ మీటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ బాగుండటంతో బంధు మిత్రులను కూడా అందులోకి ఆహ్వానిస్తున్నారు.

వరుడు దినేష్‌ క్షత్రియన్‌ మెటావర్స్‌ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నామని ట్విట్టర్ వేదికగా ఒక వీడియో షేర్ చేశాడు.ఇప్పుడు అది సంచలనం సృష్టిస్తోంది.సరికొత్త అనుభూతి అందించే వర్చువల్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు బంధు మిత్రులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు.

ప్రస్తుతం దినేష్‌ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాడు.అయితే మెటావర్స్‌కు బ్లాక్‌చైన్‌నే మూలం కావడంతో అదే పద్ధతిలోనే తన రిసెప్షన్‌ అరేంజ్ చేయాలనుకున్నాడు.

అందుకు వధువు కూడా ఒప్పుకోవడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మెటావర్స్‌ పద్ధతిలో ప్రజలు వర్చువల్‌గా మీట్ అయ్యి తమ డిజిటల్‌ అవతార్‌ల సాయంతో ఇతరులతో మాట్లాడుకోవచ్చు.మెటావర్స్‌ అనేది ఆగ్మెంటెడ్‌ రియాల్టీ, బ్లాక్‌చైన్‌, వర్చువల్‌ రియాల్టీ అనేవి మూడు టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తుంది.ఒక స్టార్ట్ అప్ కంపెనీతో కలిసి దేశంలోనే తొలిసారిగా మెటావర్స్‌ పెళ్లి చేసుకుంటున్నట్లు దినేష్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube