కరోనాతో తొలి కుక్క మరణం!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకు దారుణంగా వ్యాపిస్తుంది.ఇంకా ఈ కరోనా వైరస్ కు కేవలం మనిషి మాత్రమే కాదు పులులు, సింహాలు, పెంపుడు పిల్లులు, కుక్కలకు కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుంది.

 Dog Dies, Covid-19, New York,  First Death Case, Animals In Us, First Dog Died W-TeluguStop.com

అమెరికాలో ఇలా కరోనా భారిన పడిన జంతువుల సంఖ్య ఎక్కువ ఉంది.ఇంకా ఇప్పటి వరకు కరోనా వ్యాపించి ఈ జంతువు మరణించలేదు కానీ మొట్టమొదటిసారి అమెరికాలోని న్యూయార్క్‌లో కరోనా బారినపడి పెంపుడు కుక్క మృత్యువాతపడింది.

ప్రపంచంలో కరోనా సోకి చనిపోయిన మొదటి జంతువు ఇదేనని వైద్యులు భావిస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి జర్మన్‌ షెపర్డ్‌ కుక్కను పెంచుతున్నాడు.ఇంకా ఆ కుక్కకు నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది.

ఆతర్వాత కొన్ని రోజులకు కుక్కకు శ్వాసకోస సమస్యలు ఎదురయ్యాయి.

దీంతో ఆ కుక్క ఆరోగ్యం మరింత క్షీణించింది.

ఇంకా ఈ కుక్క గత నెల 11వ తేదీన మరణించింది.ఈ విషయాలను రాబర్ట్ మహని ”నేషనల్‌ జియోగ్రఫీ ఛానెల్‌”కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

కాగా పెంపుడు కుక్క మరణించిన సమయంలో దానిలో కేన్సర్‌ సంబంధ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్టు వైద్యులు తెలిపారు.కరోనా కారణంగా క్యాన్సర్ వచ్చి మరణించిందా? లేక కరోనా వల్లే మరణించిందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube