కిమ్ మరో దుశ్చర్య,తోలి కరోనా బాధితుడి కాల్చివేత  

first coronavirus patient in north korea - Telugu Corona Virus In Nort Korea, Coronavirus, First Coronavirus Patient Shot Dead In North Korea, North Koream And America, Noth Korea President Kim

నార్త్ కొరియా పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.నియంత పాలన చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కు సైతం హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తి.

TeluguStop.com - First Coronavirus Patient In North Korea

ఇటీవల ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ పై అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.ఆ వైరస్ అనేది నార్త్ కొరియా లో రాకూడదు లేదంటే పరిస్థితులు మారిపోతాయి అంటూ హెచ్చరించారు.

దీనితో కరోనా విషయంలో వారు అవలంబిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయి.అయితే తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.

తోలి కరోనా పాజిటివ్ కేసు బాధితుడిని అధ్యక్షుడు కిమ్ ఆదేశాల మేరకు అక్కడి అధికారులు కాల్చి చంపినట్లు తెలుస్తుంది.మామూలుగా కిమ్ నియంత పాలన చేస్తారని,ఆయనకు జాలి,దయ అన్న పదాలకు తావుండదు, అందుకే ఇటీవల కరోనా వైరస్ ఉంది అన్న అనుమానంతో ఏకంగా ఒక అధికారినే నిర్ధాక్షణీయంగా కాల్చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పడు తాజాగా మరో కరోనా పాజిటివ్ బాధితుడి ని కూడా కిమ్ ఆదేశాల మేరకు అధికారులు కాల్చి చంపినట్లు తెలుస్తుంది.అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు?ఎక్కడ నుంచి వచ్చాడు?అసలు నార్త్ కొరియా కు చెందిన వాడా లేదా మరేదేశానికి చెందినవాడా అన్న వివరాలు కూడా బయటకు రాలేదు.అయితే ప్రాణాంతక కరోనా వైరస్ ఇతరులకు సోకకుండా ఉండేందుకే ఆ దేశ నియంత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తొలి కరోనా బాధితుడిని చంపమని కిమ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

#Coronavirus #CoronaVirus #NorthKoream #NothKorea

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

First Coronavirus Patient In North Korea Related Telugu News,Photos/Pics,Images..