కరోనా వైరస్ తో పుట్టిన శిశువు... ఎక్కడంటే...?

ప్రపంచంలోని దేశాల ప్రజలందరూ కరోనా వైరస్ పేరు చెబితేనే భయపడుతున్నారు.కరోనా వైరస్ తల్లి నుండి బిడ్డకు సోకుతుందా…? అనే సందేహాలు తలెత్తుతున్న సమయంలో తాజాగా గర్భిణికి కరోనా వైరస్ సోకగా పుట్తిన బిడ్డకు కూడా కరోనా వైరస్ సోకినట్లు వదియులు వైద్య పరీక్షల్లో ధ్రువీకరించారు.కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన చైనాలోని వుహాన్ లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

 First Coronavirus Baby Born In China-TeluguStop.com

వైద్యులు మాత్రం తల్లికి వైరస్ సోకితే బిడ్డకు అదే వైరస్ సోకాలని ఏం లేదని చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని చెబుతున్నారు.

చైనా మీడియా అధికారికంగా ఈ వివరాలను ప్రకటించింది.నిన్న కరోనా వైరస్ సోకిన గర్భిణికి బిడ్డ జన్మించగా బిడ్డ జన్మించిన 30 గంటల తరువాత వైద్యులు పరీక్షలను నిర్వహించారు.

ఈ పరీక్షలో పుట్టిన బిడ్డకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

కరోనా వైరస్ సోకిన వారిలో అత్యంత చిన్న వయస్సు ఈ బిడ్డదే కావడం గమనార్హం.

సాధారణంగా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గర్భం దాల్చిన సమయంలో, బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.గత వారం కరోనా వైరస్ సోకిన గర్భిణి బిడ్డకు జన్మనివ్వగా ఆ బిడ్డకు మాత్రం కరోనా వైరస్ సోకలేదు.

ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి 500 మంది మరణించగా 20,000 మందికి అధికారికంగా ఈ వైరస్ బారిన పడినట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube