కరోనా పేషంట్‌ నెం.1 ఎవరు? ఆమె పరిస్థితి ఇప్పుడు ఏంటో తెలుసా?

కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు విస్తరించింది.కేవలం మూడు నెలల్లోనే ఈ వైరస్‌ ప్రపంచాన్ని చుట్టేసింది.

 First Corona Patient In Chaina What Is The Present Condition Of That Patient, Ch-TeluguStop.com

గత నాలుగు వారాలుగా ఈ వైరస్‌ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది.కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షలకు చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరో రెండు మూడు రోజుల్లో మిలియన్‌కు చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటూ వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో అసలు కరోనా ఎలా మొదలైంది అనే విషయాన్ని అంతర్జాతీయ మీడియా గుర్తించింది.

ముందు నుండి ఊహిస్తున్నట్లుగానే కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ నగరంలో ఉన్న సీ ఫుడ్‌ మార్కెట్‌లోని ఒక మహిళకు సోకింది.ఆ మహిళను ఎట్టకేలకు ట్రేస్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు.

ఆ మహిళ డిసెంబర్‌ 10వ తారీకున జలుబు, దగ్గుతో బాధపడుతూ స్థానికంగా ఒక హాస్పిటల్‌కు వెళ్లింది.అక్కడ చిన్నపాటి ట్రీట్‌మెంట్‌ చేసి పంపించారు.

అయినా తగ్గక పోవడంతో వుహాన్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో ఆమెకు పరీక్షలు చేసి చికిత్స అందించారు.అప్పటికి కరోనా గురించి వారు గుర్తించలేక పోయారు.

ఆమె బాధపడుతున్న లక్షణాలతోనే వందలాది మంది హాస్పిటల్స్‌కు వస్తున్న నేపథ్యంలో అప్పుడు అదో భయంకరమైన వైరస్‌గా వైధ్యులు గుర్తించి వుహాన్‌ నగరంను దిగ్బందించేశారు.అయినా అప్పటికే చైనా మొత్తం కూడా అది పాకింది.

వుహాన్‌ నగరంలో అత్యధికంగా పాకినట్లుగా చెబుతున్నారు.ఇక్కడ చిత్రమైన విషయం ఏంటీ అంటే ఎవరికైతే మొదట కరోనా వైరస్‌ సోకింది ఆ మహిళ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉంది.

కాని ఆమె వల్ల వైరస్‌ వచ్చిన వారు వేలల్లో చనిపోతున్నారు.ఆమెకు వైరస్‌ ఎలా వచ్చిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube