మేరీల్యాండ్( Maryland ) నివాసికి స్థానిక పరిసరాలలోని దోమల వల్ల మలేరియా వ్యాధి వచ్చినట్లు 2023 ఆగస్టు 18న నిర్ధారించబడింది, 40 సంవత్సరాల తరువాత రాష్ట్రంలో నమోదైన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం.మలేరియా వ్యాధి బారిన పడ్డ సదరు వ్యక్తి ఇటీవల కాలంలో రాష్ట్రం దాటి బయటికి వెళ్ళలేదు.
దీన్ని బట్టి ఈ వ్యాధిని స్థానికంగా అతను పొందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ వ్యక్తి క్రమంగా కోలుకుంటున్నాడు.
రాష్ట్రంలో మలేరియా ప్రజారోగ్యానికి ముప్పుగా పరిగణించబడలేదు.అయినా ఈ వ్యాధి మునుపటిలాగా ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మేరీల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సెక్రటరీ, లారా హెర్రెరా స్కాట్( Laura Herrera Scott ) వెల్లడించారు.

మలేరియా( Maleria ) అనేది పరాన్నజీవి వల్ల దోమల ద్వారా సంక్రమించే వ్యాధి.సోకిన దోమ కాటు ద్వారా పరాన్నజీవి మానవులకు వ్యాపిస్తుంది.మలేరియా లక్షణాలు సాధారణంగా జ్వరం, చలి, ఫ్లూ లాంటి అనారోగ్యం.యునైటెడ్ స్టేట్స్‌లో మలేరియా ప్రమాదం చాలా తక్కువ.అయితే దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం, పురుగుల మందు వాడటం, పొడవాటి చేతులు, ప్యాంటు ధరించడం, కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మేరీల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్( Maryland Department of Health ) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
మలేరియా వ్యాప్తిని నిరోధించడానికి కృషి చేస్తోంది.దోమల బెడద నుండి తమను తాము రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని మేరీల్యాండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నివాసితులను కోరుతోంది, ముఖ్యంగా మలేరియా ఉన్న ప్రాంతాలలో నివసించేవారు లేదా ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది.

మలేరియా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చర్మంపై మస్కిటో రెపలెంట్ ప్రొడక్ట్స్ అప్లై చేయాలి.వీలైనప్పుడు పొడవాటి చేతులు, ప్యాంటు ధరించాలి.కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి లేదా స్క్రీన్‌లతో కవర్ చేసుకోవాలి.దోమలు గుడ్లు పెట్టకుండా నిరోధించడానికి కనీసం వారానికి ఒకసారి నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేయాలి.







