కరోనా ఎఫెక్ట్: ''కార్‌-ఇన్'' రెస్టారెంట్ ఎక్కడో తెలుసా?

రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు తీవ్రమైన ఆంక్షలను విధించాయి.ఈ నేపథ్యంలోనే కువైట్ లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో కువైట్ ప్రభుత్వం మరింత కఠినమైన ఆంక్షలను విధించింది.

 First Car In Restaurant Service Started In Kuwait After Dine Ins Banned , Restau-TeluguStop.com

ఈ విధంగా ఆంక్షలు విధించడంతో ప్రతి ఒక్క రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ముఖ్యంగా హోటళ్లను, రెస్టారెంట్లను నడిపే వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో కస్టమర్లు లేక రెస్టారెంట్లు బోసిపోతున్నాయి.

అదేవిధంగా రెస్టారెంట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి.రెస్టారెంట్లలో కేవలం డెలివరీ సర్వీసులకు మాత్రమే అనుమతి లభించింది.

రెస్టారెంట్లలో డైన్-ఇన్‌కు అనుమతి లేదంటూ కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ విధమైన ఆంక్షలు విధించడంతో ఓ రెస్టారెంట్ వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వినూత్నరీతిలో ఆలోచించి ప్రభుత్వం జారీ చేసిన అనుమతులను అతిక్రమించకుండా ఎంతో చాకచక్యంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు.

రెస్టారెంట్లలో ప్రభుత్వం డైన్-ఇన్‌కు అనుమతి ఇవ్వకపోయినా డెలివరీ సర్వీసులకు అనుమతి ఉండడంతో ఆ రెస్టారెంట్ యజమాన్యం కార్-ఇన్ సర్వీసును ప్రారంభించాలనే సరికొత్త ఆలోచన చేసింది.ఆ ఆలోచన రావడమే ఆలస్యం దానిని ఆచరణలో పెట్టి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు.

Telugu Car Restaurant, Corona Effect, Dine Ins, Car, Kuwait, Restaurant-Latest N

కార్-ఇన్ సర్వీసు అంటే రెస్టారెంట్ల ముందు కారు వచ్చి ఆపితే చాలు కస్టమర్లకు కావలసిన ఆహార పదార్థాలు అన్ని కారులో కూర్చుని ఆర్డర్ చేస్తే చాలు రెస్టారెంట్ యాజమాన్యం వారికి సర్వీస్ చేస్తారు.కస్టమర్లు కూడా కరోనా ఎక్కువగా ఉండటం వల్ల కార్లో కూర్చుని తినడానికి ఇష్టపడుతున్నారు.హోటల్ యాజమాన్యం చేసిన వినూత్నమైన ఆలోచన వల్ల వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో ఇదే ఆలోచనలో మరిన్ని రెస్టారెంట్ కూడా కార్_ ఇన్ సర్వీసులను ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube