ఇండియాలో మొదటి 100 కోట్ల చిత్రం…14 ఏళ్ల పాటు బద్దలు కొట్టలేని రికార్డ్

ఈ రోజుల్లో హిట్.సూపర్ హిట్.

 First 100 Crores Movie Records In South India-TeluguStop.com

బంఫర్ హిట్.అనే మాటలకు అర్థాలు పూర్తిగా మారిపోయాయి.

వారం రోజులు సినిమా ఆడితేనే ఇండస్ట్రీ రికార్డు అంటూ ఊకదంపుడు ప్రకటనలు ఇస్తున్నారు నిర్మాతలు.కానీ ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు.

 First 100 Crores Movie Records In South India-ఇండియాలో మొదటి 100 కోట్ల చిత్రం…14 ఏళ్ల పాటు బద్దలు కొట్టలేని రికార్డ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా లాంగ్ రన్ లోనే మంచి వసూళ్లు చేపట్టేవి.ఇప్పుడు టికెట్ హైక్స్ దెబ్బకు తొలి రోజునే వంద కోట్లు సంపాదించిన సినిమాలు కూడా ఉన్నాయి.

అయితే ఇండియన్ సినిమా చరిత్రలో 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ దాటిన తొలి సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో ఎన్నడూ లేని సరికొత్త రికార్డును బద్దలు కొట్టిన సినిమా.సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ మూవీ.2007లలో వచ్చిన సినిమా సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో కనీవినీ ఎరుగని విజయం సాధించింది.కోలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో 100 కోట్లు గ్రాస్ వసూళ్లు అందుకున్న సినిమా చరిత్రకెక్కింది.ఈ సినిమా తెలుగులో 18 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

మొత్తంగా టోటల్ రన్ లో ఈ సినిమా 133 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.

Telugu 100 Crores, Bollywood, Director Shanker, Movie, Rajinikanth, Shivaji, Sriya, Suman, Tollywood-Telugu Stop Exclusive Top Stories

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 39 సెంటర్లలో 50 రోజులు ఆడింది.భారీగా వసూళ్లు సాధించింది.అటు బాలీవుడ్ లో సైతం ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది.

రజనీ కాంత్ సత్తా ఏంటో ఈ సినిమా ద్వారా యావత్ భారతానికి తెలిసింది.ఈ సినిమా పునాదిగా పడితే దానిపై రోబో అనే భారీ భవనం నిలబడిందని చెప్పుకోవచ్చు.

బ్లాక్ మనీ కేంద్రంగా కొనసాగిన ఈ సినిమా.మంచి జనాదరణ పొందింది.

ఇందులో రజనీ హీరోగా నటించగా.మరో ప్రముఖ నటుడు సుమన్ విలన్ రోల్ ప్లే చేశాడు.

అందాల తార శ్రియ హీరోయిన్ గా నటించింది.మొత్తంగా ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమకు ఓ మైలు రాయిగా నిలిచింది.

#100 Crores #Suman #Shivaji #Sriya #Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు