ఇదేందయ్యా ఇది: కొళాయి నుండి నీటితో పాటు మంటలు..!

మనం ఎన్నోసార్లు వినే ఉంటాం.నీరు – నిప్పు రెండు కలవవని.

 Fires Along With Water From The Faucet, Chaina, Tap Water, Fire, Viral Video. So-TeluguStop.com

అయితే ఈ వీడియో చూస్తే మాత్రం మన కళ్ళని మనమే నమ్మలేము.దీనికి కారణం ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో కొళాయి నుంచి నీటితోపాటు మంటలు కూడా రావడం జరుగుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

చైనా దేశంలో ఉన్న తూర్పు ప్రాంతంలో లియోనింగ్ ప్రావీన్స్‌లో గల పాంజిన్ నగరంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది.

స్థానికంగా ఉన్న ఓ మహిళ సోషల్ మీడియా ద్వారా ఈ సంఘటనకు సంబంధించి ఈ వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా ఈ వీడియో మారింది.గత కొద్ది కాలం నుండి ఈ సమస్యను తాము ఎదుర్కొంటున్నట్లు ఆవిడ అందులో తెలిపింది.

వారు ఉంటున్న ఇంట్లో ఉన్న బాత్ రూమ్, వంటగది, చేతులు కడుక్కోవడానికి ఉపయోగించే సింక్ ఇలా ప్రతిచోటా ఒక్కోసారి అనుకోకుండా మంటలు చెలరేగుతున్నాయి అని దాంతో తాము భయపడిపోతున్నామని చెప్పుకొచ్చింది.ఇందుకు సంబంధించి వారు స్థానిక నీటి సరఫరా అధికారులకు ఫిర్యాదు చేయగా వారు తమ చేతుల్లో ఎటువంటి పరిష్కారం లేదని చేతులెత్తేశారు.

అయితే కేవలం తమ కుటుంబం మాత్రమే కాదని తమ చుట్టుపక్కల ఉన్న సుమారు వందకు పైగా కుటుంబాలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆవిడ తెలియజేసింది.ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడంతో అక్కడున్న అధికారులు ఓ మెట్టు దిగి రాక తప్పలేదు.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు ముందుగా ఆ ప్రాంతంలో నీటి సరఫరా నిలిపివేస్తామని వారు తెలిపారు.చివరికి వారు చేసిన పరిశోధనల్లో భాగంగా అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టంలో ఉన్న చిన్న లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని.

అందుకే ఇలా మంటలు వస్తున్నాయని వారు తెలిపారు.ఆ తర్వాత సమస్యని తగ్గేలా చేసిన తర్వాత నీటి సరఫరా పునరుద్ధరించామని అధికారులు తెలిపారు.

ఇందుకు కారణం ముఖ్యంగా అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టం లోకి ఓ చోట గ్యాస్ లీక్ కావడం వలన ఈ సమస్య ఏర్పడి ఉంటుందని వారు తెలిపారు.ఇందుకు సంబంధించి విచారణ చేపడుతున్నట్లు అధికారులు మీడియాకు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube