కాలిఫోర్నియా అడవుల్లో కారుచిచ్చు...!!

అమెరికా పై ప్రకృతి పగబట్టిందా అనిపిస్తోంది తాజా పరిస్థితులని గమనిస్తుంటే.2019 లో మొదలైన కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయినా దాని ప్రభావం మాత్రం అమెరికాపై పూర్తి స్థాయిలో చూపిస్తోంది.ప్రపంచంలో కరోనా కేసుల భాదితులు , మృతులు అమెరికాలో అత్యధికంగా ఉన్నారు.ఇదిలాఉంటే తాజాగా ప్రకృతి కోపించిందో లేదా మానవ తప్పిదమో ఏమో కనీ కాలిఫోర్నియా అడువుల్లో కారు చిచ్చు రగులుకుంది.

 Wild Fires Near Gilroy Consumes 2000 Acres, Wild Fire, California, America-TeluguStop.com

సహజంగానే అమెరికా టొర్నాడో లు, వరదలకి అలవాటు పడిపోయింది.తాజాగా ఈ ప్రకృతి బీభత్సం తో ఆందోళన చెందుతోంది.

అమెరికాలోని కాలిఫోర్నియా లో ఉన్న దట్టమైన అడవులలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.అగువా డల్సే ప్రాంతంలో చేరరేగిన ఈ మంటలు అడవిని వేగంగా దహించుకు పోతున్నాయి.

ఒక్క సారిగా ఉద్రుతమైన ఈ మంటలని చల్లార్చడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్ మోజావే ఎడారిని కలిపే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

ఈ అడవికి దగ్గరలో నివసిస్తున్న ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించారు.

Telugu America, Calinia, Wild, Wildgilroy-

ఎగసి పడుతున్న మంటలని ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది హెలికాఫ్టర్ ల సాయంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది.సుమారు 5,400 ఎకరాల అడవి ఈ కారు చిచ్చులో కాలి బూడిద అయిపోయిందని అధికారులు తెలిపారు.రహదారిని మూయడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

ఇదిలాఉంటే గతంలో ఆస్ట్రేలియాలో ఇలాంటి కారు చిచ్చు రగలడంతో కొన్ని వేల ఎకరాల భూమి కాలిపోగా లక్షలాది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube