ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో భారీ అగ్ని ప్రమాదం  

Fire Accident In Indian 2 Movie Shooting Location - Telugu Director Shankar, Fire Accident, Indian 2 Movie Shooting Location, Kamal Hasan

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భారతీయుడు-2.పదేళ్ళ క్రితం వచ్చిన భారతీయుడుకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Fire Accident In Indian 2 Movie Shooting Location

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై సమీపంలోని పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.షూటింగ్ జరుగుతూ ఉండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మరో పదిమందికి పైగా తీవ్రంగా గాయాలు అయ్యాయి స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న నజరేత్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయిన వారు ప్రొడక్షన్ అసిస్టెంట్స్ మధు, చంద్రన్, సహాయ దర్శకుడు కృష్ణ (34) గా తెలుస్తుంది.ఇక గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం క్షతగాత్రులను చెన్నైలోని సవిత ఆస్పత్రికి తరలించి చికిత్ అందిస్తున్నారు.

మరోవైపు మృతదేహాలను రాజీవ్ గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఇక ఘటన జరిగిన సమయంలో హీరో కమల్ హసన్ అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది.ఈ ప్రమాదం వలన షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది.దీనిపై దర్శకుడు, నిర్మాత మీడియా ముందుకి వచ్చి ఎం చెబుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.

తాజా వార్తలు

Fire Accident In Indian 2 Movie Shooting Location-fire Accident,indian 2 Movie Shooting Location,kamal Hasan Related Telugu News,Photos/Pics,Images..