మ‌ళ్లీ స్పీడ్‌ పెంచిన ఫైర్ బ్రాండ్ ధ‌ర్మ‌పురి.. హుజూరాబాద్ కేడ‌ర్‌లో జోష్

Fire Brand Dharmapuri Speeds Up Again Josh In Huzurabad

తెలంగాణ బీజేపీలో ఆ ద్వ‌యాన్ని చూస్తే ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు అంద‌రూ మోడీ, షా ద్వ‌యంలాగే స‌క్సెస్ అవుతున్నారంటూ మురిసిపోతుంటారు.అలాంటి ద్వ‌యంలో ఓ ఫైర్ బ్రాండ్ చాలా కాలంగా సైలెంట్ అయిపోయారు.

 Fire Brand Dharmapuri Speeds Up Again Josh In Huzurabad-TeluguStop.com

ఎందుకో ఏంటో తెలీదు గానీ త‌న మాట‌ల తూటాల‌ను త‌గ్గించుకుని సైలెంట్ రాజ‌కీయాలు చేశారు.కానీ ఇప్పుడు మ‌ళ్లీ ట్రాక్ ఎక్కిన‌ట్టు క‌నిపిస్తున్నారు.

త‌న కౌంట‌ర్ల‌తో మ‌ళ్లీ పార్టీలో జోష్ పెంచేస్తున్నారు.ఆయ‌నే నిజ‌మాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌.

 Fire Brand Dharmapuri Speeds Up Again Josh In Huzurabad-మ‌ళ్లీ స్పీడ్‌ పెంచిన ఫైర్ బ్రాండ్ ధ‌ర్మ‌పురి.. హుజూరాబాద్ కేడ‌ర్‌లో జోష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్ర‌స్తుతం ఆయ‌న హుజూరాబాద్‌లో పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు.

ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరారో అప్ప‌టి నుంచే ఆయ‌న కొంచెం సైలెంట్ అయిపోయిన‌ట్టు క‌నిపించింది.

పెద్ద‌గా ఎలాంటి కామెంట్లు చేయ‌కుండా మౌనంగా ఉన్న ఆయ‌న ఇప్పుడు మ‌ల్లీ ఘాటు కౌంట‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.టీఆర్ఎస్ నేతల కౌంట‌ర్ల‌కు రీ కౌంట‌ర్లు వేస్తూ దుమ్ము లేపుతున్నారు.

హుజూరాబాద్ లో ఈట‌ల రాజేంద‌ర్ త‌ర‌ఫున ప్ర‌చారాలు చేస్తూ త‌న‌దైన దూకుడున ప్ర‌ద‌ర్శిస్తున్నారు.దీంతో హుజూరాబాద్ కేడ‌ర్‌లో ఫుల్ జోష్ క‌నిపిస్తోంద‌తి.

ఇక ఆయ‌న రీసెంట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హుజూరాబాద్ లో ఈట‌ల రాజేంద‌ర్ గ‌తంలో చేసిందేమీ లేదంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారానికి తన స్టైల్‌లో ధ‌ర్మపురి అర‌వింద్ గ‌ట్టి పంచ్ ఇచ్చేశారు.

Telugu Bandi Sanjay, By-elections In Huzurabad, Dharmapuri Aravind, Etela Rajender, Huzurabad Bjp Cadre, Kcr, Nizamabad Mp Dharmapuri Aravind, Telangana Bjp, Trs Party, Ts Politcs-Telugu Political News

ఈట‌ల రాజేంద‌ర్ చేసిందేంటో ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని లేక‌పోతే ఇన్ని రోజులు మీ పార్టీలో ఉన్న‌ప్పుడు ఎందుకు అన‌లేదంటూ మండిప‌డ్డారు.అంతే కాదు ఈట‌ల గెలిస్తే ఏమొస్తదంటున్నార‌ని.ఈట‌ల గెలిస్తే కేసీఆర్ బుద్దొస్తద‌ని చెప్ప‌డం హైలెట్‌గా మారింది.ఏదేమైనా మ‌ళ్లీ ధ‌ర్మ‌పురి ఫామ్‌లోకి వ‌చ్చేసారని ఆయ‌న అభిమానులు తెగ సంబుర ప‌డుతున్నారు.ఒక‌ప్పుడు ఈట‌ల విష‌యంలో సైలెంట్ గా ఉన్న ఆయ‌న ఇప్పుడు ఈట‌ల‌ను గెలిపించేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

#Politcs #Bandi Sanjay #HuzurabadBjp #Telangana BJP #Trs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube