విశాఖ ఉక్కు దీక్షా శిబరంలో అగ్నిప్రమాదం.. !

ఉద్యమం చేయడం అంటే సాగరానికి ఎదురీదడమే.అందుకే ఉద్యమంలో పాల్గొంటే ఒక్కో సారి ప్రాణ నష్టం కూడా జరగవచ్చూ.

 Fire At Visakhapatnam Steel Initiation Camp-TeluguStop.com

నాటి చరిత్ర నుండి నేటి వరకు చూస్తే ఎందరో ఉద్యమాల్లో పాల్గొని ఊపిరి వదిలినట్లు తెలుస్తుంది.ఇకపోతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కార్మికులు కొందరు ఉద్యమకారులుగా మారి నిరసనలు తెలియచేస్తూ శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే వీరు దీక్షా కోసం ఏర్పాటు చేసుకున్న శిబరంలో ఈరోజు తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.కాగా కొందరు వాకర్స్ ఈ మంటలను గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు అయితే ఈ ప్రమాదం పై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 Fire At Visakhapatnam Steel Initiation Camp-విశాఖ ఉక్కు దీక్షా శిబరంలో అగ్నిప్రమాదం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న అంతా ఇక్కడ భారీగా వర్షం కురిసిందని, ఈ క్రమంలో దీక్షా శిబిరం వర్షానికి తడిసి ఉండగా మంటలు అంటుకునే చాన్స్ లేదని తెలుపుతున్నారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్య తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారట.

#Steel #Fire Accident #Visakhapatnam #Initiation Camp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు