నగరంలో అగ్నిప్రమాదం.. !

ప్రస్తుతం లోకంలో జరుగుతున్న ప్రమాదాలు ప్రజల జీవితానికి సవాల్‌గా మారాయి.ఇప్పటికే కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా అగ్ని ప్రమాదాలు కూడా ఇదే తీరుగా ఎదురవుతున్నాయి.

 Fire At Narayanaguda In Hyderaba-TeluguStop.com

నిత్యం ఎక్కడో ఒకచోట ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నాం కదా.

ఇకపోతే ఈ మహానగరం హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ముందుగా ప్రాణ నష్టం కంటే ఆస్తి నష్టం ఎక్కువగా చోటు చేసుకున్న సంఘటనలు ఇదివరకు చూసే ఉంటాం.అప్పుడప్పుడు మాత్రం తీవ్ర ప్రాణ నష్టం కలుగుతుంది.ఇకపోతే తాజాగా హైద‌రాబాద్‌లోని నారాయ‌ణ‌గూడలోని అవంతి న‌గ‌ర్‌లో ఓ ఇంట్లో అర్ధ‌రాత్రి స‌మయంలో ఊహించని విధంగా అగ్నిప్రమాదం సంభవించింది.

 Fire At Narayanaguda In Hyderaba-నగరంలో అగ్నిప్రమాదం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగి ఆ ప్రాంతం మొత్తం ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకోవడంతో స్దానికులు భయాందోలనకు గురైయ్యారట.

ఇక ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని కాపాడి స‌మీపంలో ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించారుట.

కానీ ఒక‌రు మృతి చెందార‌ని పోలీసులు పేర్కొన్నారు.ఇక ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే కారణాలు తెలియరాలేదు.

#Narayanaguda #Avanti Nagar #Fire #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు