అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం…క్లారిటీ ఇచ్చిన నాగార్జున !  

Annapurna studio , Nagarjuna , tollywood, hyderabad, bigg boss - Telugu Annapurna Studio, Bigg Boss, Hyderabad, Nagarjuna, Tollywood

హైదరాబాద్ ‌లో ఉన్న అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.ఓ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ ‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని మీడియాలో ప్రచారం జరిగింది.

TeluguStop.com - Fire At Annapurna Studio Clarity Given By Nagarjuna

అయితే, వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి అగ్నిని ఆపడంతో భారీ ప్రమాదం తప్పింది అని , పెద్దగా ఆస్తి నష్టం జరగలేదు అని ప్రచారం చేశారు.

అయితే , అదే అన్నపూర్ణ స్టూడియో లోనే బిగ్‌బాగ్ తెలుగు 4 సెట్ సైతం ఉండటం గమనార్హం.

TeluguStop.com - అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం…క్లారిటీ ఇచ్చిన నాగార్జున -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో బిగ్‌బాస్ 4 సెట్‌ లోనూ అగ్ని ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.దీంతో తమ అభిమాన కంటెస్టెంట్లు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన వ్యక్తం అయింది.

తాజాగా అగ్ని ప్రమాదం ఘటనపై అన్నపూర్ణ స్టూడియోస్ స్పందించింది.అసలు స్టూడియో లో ప్రమాదమేమీ జరగలేదు అని స్పష్టం చేసింది.

ఈ ప్ర‌మాదంపైఅక్కినేని నాగార్జున కూడా స్పందించారు.ఈ రోజు ఉదయం నుంచి అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్ర‌మాదంపై వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, అయితే అన్నపూర్ణ స్టూడియోలో అలాంటిదేం జ‌ర‌గ‌లేద‌ని, అంతా బాగానే వుంద‌ని, అది ఓ త‌ప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు.

ఈ మేర‌కు నాగ్ ఓ ట్వీట్ చేశారు.

#Hyderabad #Bigg Boss #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fire At Annapurna Studio Clarity Given By Nagarjuna Related Telugu News,Photos/Pics,Images..