భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి..!  

Fire Accident at Vijayawada Covid Center, COVID-19. COVID Center, Vijayawada - Telugu Covid Hospistal, Covid-19. Covid Center, Fire Accident, Fire Accident At Vijayawada Covid Center, Vijayavada, Vijayawada

కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.కోవిడ్ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి చికిత్స పొందుతున్న బాధితులు, వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

 Fire Accident Vijayawada Covid Center

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలు ఆర్పారు.

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్ లో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఏలూరు రోడ్డులోని రమేశ్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కాగా, ఈ భవనంలో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం.వీరిలో 30 మంది వరకు కరోనా బాధితులు ఉండగా.10 మంది ఆస్పత్రి సిబ్బంది కరోనా బాధితులకు చికిత్సను అందిస్తున్నారు.

ప్రమాదంలో ఏడుగురు మరణించగా.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీపీ శ్రీనివాసరావు వెల్లడించారు.అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దట్టమైన పొగ వెలువడటంతో కరోనా బాధితులకు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

దీంతో వాళ్లు కిటికీల్లోంచి కేకలు వేస్తూ భయాందోళన చెందారు.కొందరు కిటికీల్లోంచి దూకడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి అని ఆయన అన్నారు.తెల్లవారుజామున 4.45 నుంచి 5.00 గంటల మధ్యలో షాట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయని సీపీ తెలిపారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించాడు.

#COVID-19.COVID #Vijayawada #FireAccident #Fire Accident #Vijayavada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fire Accident Vijayawada Covid Center Related Telugu News,Photos/Pics,Images..