యశ్వంత్ పూర్ – టాటా ఎక్స్ ప్రెస్ లో భారీ అగ్ని ప్రమాదం!  

తప్పిన ఘోర అగ్ని ప్రమాదం. అప్రమత్తతతో బయటపడ్డ ప్రయాణికులు. .

Fire Accident In Yesvantpur - Tata Express-express Train,fire Accident,railway Ministry,tata,yesvantpur

యశ్వంత్ పూర్ నుంచి టాటా నగర్ వెళ్ళే ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రైన్ లో ప్యాంట్రీకారులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో దానిని గుర్తించి చైన్ లాగడంతో ట్రైన్ ఆఫ్ చేసిన సిబ్బంది వెంటనే బోగీలని వేరు చేసారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది..

యశ్వంత్ పూర్ – టాటా ఎక్స్ ప్రెస్ లో భారీ అగ్ని ప్రమాదం!-Fire Accident In Yesvantpur - TATA Express

అసలే అర్ధరాత్రి కావడంతో పూర్తిగా అంధకారంలో, అందరూ గాఢ నిద్రలో వున్నారు.అయితే ఎవరో ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదాన్ని గుర్తించడంతో ప్రయాణికులు అందరూ క్షేమంలో ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా బయట పడ్డారు. ఈ ప్రమాదంలో రెండు రైలు భోగీలు దగ్ధం కాగా, అగ్ని ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ట్రైన్ వద్దకు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

ఇక ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్, వైజాగ్ మధ్య తిరిగే రైళ్ళ రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి.