తిరుమలలో అగ్ని ప్రమాదం.. !

ఉదయం వార్తలు తిరిగేస్తే చాలు ప్రమాదాలు, మరణాలు, నిత్యం అగ్నిహోత్రంలా మారిపోయాయి.ఇక భక్తుల పాలిట కొంగు బంగారంగా, పిలిచినంతనే పలికేటి దైవంగా, ఆపదలు తీర్చే కలియుగ వైకుంఠ హరిగా సేవలు అందుకుంటున్న తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించిందట.

 Fire Accident, Tirumala, Srivari, Asthan Mandapam, Shops-TeluguStop.com

కాగా ప్రమాదంలో ఆరు దుకాణాలు మంటలకు ఆహుతయ్యాయని సమాచారం.ఇక ప్రమాద ఘటన సమాచారాన్ని అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదట.ఈ అగ్నిప్రమాదం ఎలా చోటు చేసుకుందనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారట.

ఇకపోతే ఊహించని ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారట.ఇప్పటికే కరోనా వల్ల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను తగ్గించి కోవిడ్ నిబంధనల మేరకు దర్శనానికి అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube