వేసవి కాలం కావడంతో ప్రతి రోజు ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.నేడు హైదరాబాద్లోని కార్వాన్లో ఉండే కోకాకోల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
నిమిషాల్లో మంటలు పెద్దగా అవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు చాలా కష్టపడుతున్నారు.పెద్ద ఎత్తున అగ్నిమాపక శకటాలు ప్రస్తుతం అక్కడ మంటలను మరింతగా వ్యాప్తిం చెందకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
స్థానికుల కథనం మేరకు ప్రమాదం జరిగిన పది నిమిషాల్లో అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలంకు చేరుకున్నాయట.అయినా కూడా అగ్ని ప్రమాదంను అదుపులోకి తీసుకు రాలేక పోతున్నాయట.
మంటలు అంతకు అంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తి నష్టం భారీగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అయితే ఈ ప్రమాదం గురించి ఇంకా కోకాకోల కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత స్పందించే అవకాశం ఉంది.
ఇప్పటికే పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేయడం జరిగింది.
ప్రాణ నష్టం ఏమైనా జరిగి ఉండవచ్చా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.దట్టమైన పొగ అలుముకోవడంతో చుట్టు కిలోమీటర్ మేరకు పొగలు కనిపిస్తున్నాయి.