స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. పిల్లల రోదనలతో దద్దరిల్లిన స్కూల్..

తాజాగా ఒక స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.స్థానికులు వెంటనే స్పందించడంతో సకాలంలో అందరి పిల్లలను రక్షించగలిగారు.

 Fire Accident In Hyderabad Old City Srinivasa High School, Hyderabad Fire Accide-TeluguStop.com

ఈ ఘటన హైదరాబాద్ లోని పాతబస్తీలో ఒక ప్రైవేట్ స్కూల్లో చోటుచేసుకుంది.అందుతున్న సమాచారం ప్రకారం పాతబస్తీ గౌలీపురాలోని శ్రీనివాస హైస్కూలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది.

సకాలంలో స్కూల్ సిబ్బంది స్పందించడంతో స్థానికులను పిలిచి వారి సహాయంతో మంటలు ఆపేసారు.

ఈ సమయంలో ఆ స్కూల్లో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న విద్యార్థులు భయంతో అరుపులు చేయడం మొదలుపెట్టారు.

స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల లోపల ఉన్న విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.అయితే ఈ ఘటనలో స్కూలు మాత్రం కొంత వరకు దగ్ధమైంది.

మంటలు ఒక్కసారిగా రావడంతో లోపల ఉన్న పిల్లలు, టీచర్లు వెంటనే బయటకు వచ్చేసారు.అంతేకాదు లోపల ఉన్న స్కూల్ స్టాఫ్ కూడా బయటకు పరుగులు తీశారు.

తర్వాత స్కూల్ సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలు ఆపేయడానికి ప్రయత్నించారు.అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు.వారు వెంటనే స్కూల్ కు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ఈ సంఘటనలో స్కూల్ కు సంభందించిన ఫైల్స్, రికార్డులు మొత్తం పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తుంది.

Telugu School, Hyderabad-Latest News - Telugu

కరోనా కారణంగా ఈ సంవత్సరం స్కూల్స్ అస్సలు జరగలేదు.ఈ ఏడాదంతా ఆన్లైన్ లోనే క్లాసులను నిర్వహించారు.అయితే ఈ మధ్యనే ప్రభుత్వ ఆదేశాలతో స్కూల్స్ మళ్ళీ ప్రారంభమయ్యాయి.అన్ని నిభందనలు పాటిస్తూ క్లాసులు జరిపించాలని ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది.విద్యార్థులు తప్పనిసరిగా స్కూలుకు హాజరవ్వాలని నిభందనలు ఏమిలేవని తల్లిదండ్రులకు ఇష్టమయితేనే స్కూలుకు అనుమతిస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు.ప్రారంభమయిన 4 రోజుల్లోనే ఈ ఘటన జరగడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube