గుజరాత్ లో ఘోర అగ్నిప్రమాదం...21 మంది విద్యార్థులు మృతి  

Fire Accident In Gujarat....21 Students Died-

గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.గుజరాత్ లోని సూరత్ లో ఒక కోచింగ్ సెంటర్ లో భారీ గా మంటలు చెలరేగడం తో దాదాపు 21 మంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.సూరత్ లోని ఒక వాణిజ్య భవనంలోని నాలుగో అంతస్తు లో ఈ కోచింగ్ సెంటర్ ఉంది.అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ మంటలు చెలరేగడం తో విద్యార్థులు ఏమి చేయాలో పాలు పోక కొందరు ప్రాణాలు కాపాడుకోవాలని పై నుంచి కిందకు దూకారు..

Fire Accident In Gujarat....21 Students Died--Fire Accident In Gujarat....21 Students Died-

అయితే ఈ క్రమంలో విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

మృతి చెందిన వారంతా కూడా 14 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారే.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….ఒక వాణిజ్య భవనంలో నిర్వహిస్తున్న కోచింగ్‌ సెంటర్‌ పై అంతస్తులో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.అనంతరం దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించడం తో భవనంలోనే ఉన్న సుమారు 50 మంది విద్యార్థులు హాహాకారాలు చేశారు.మంటలను అదుపు చేసేందుకు స్థానికులు తమ వంతు ప్రయత్నం చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

చివరికి మంటల నుంచి ప్రాణాలు కాపాడు కోవాలన్న ఆందోళనలో భవనం పైనుంచి పలువురు విద్యార్థులు దూకేశారు.వారిలో 21 మంది ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన కొందరిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.అయితే ఇంకా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 19 ఫైర్ ఇంజన్లు ఉపయోగించారు ఫైర్ సిబ్బంది.మరోపక్క ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.