అఖండ సినిమా చూస్తుండగా ఒక్కసారిగా కాలిపోయిన స్క్రీన్.. ఏం జరిగిందంటే?

Fire Accident In Cinema Theater In Palasa Akhanda Movie

బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ.సినిమా డిసెంబర్ 2న థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.

 Fire Accident In Cinema Theater In Palasa Akhanda Movie-TeluguStop.com

సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.థియేటర్ల వద్ద జై బాలయ్య అన్న నినాదాలతో థియేటర్లు మార్మోగిపోతున్నాయి.

 Fire Accident In Cinema Theater In Palasa Akhanda Movie-అఖండ సినిమా చూస్తుండగా ఒక్కసారిగా కాలిపోయిన స్క్రీన్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా విడుదలైన రెండు రోజులకి దాదాపుగా 40 కోట్ల గ్రాస్ ను అందుకుంది.థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఆన్ లైన్ లో సైతం టికెట్లు దొరకడం లేదు.

ఇదిలా ఉంటే అఖండ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఇప్పటికే రెండు మూడు సార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

ఇటీవలే వరంగల్ లో అఖండ సినిమా చూస్తున్న సమయంలో థియేటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు భయాందోళనతో థియేటర్ బయటకు పరుగులు తీశారు.అనంతరం మరొక చోట ఒక అభిమాని బాలయ్య బాబు సినిమా చూస్తూ థియేటర్లలోనే కుప్పకూలాడు.

అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఇక తాజాగా మరో ఒక చేదు సంఘటన జరిగింది.

Telugu Akhanda, Theater, Show, Palasa, Ravishankar, Screen, Short Circuit-Movie

ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తున్న సమయంలో థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని, శ్రీకాకుళం జిల్లా, పలాసలోని రవి శంకర్ థియేటర్ లో చోటు చేసుకుంది.అఖండ సినిమా ఫస్ట్ షో ప్రారంభం అయిన కాసేపటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా సౌండ్ సిస్టం లో మంటలు చెలరేగాయి.క్షణాల వ్యవధిలోనే థియేటర్ లోని స్క్రీన్ కు మంటలు వ్యాపించాయి.

దీంతో ప్రేక్షకులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.

#Akhanda #RaviShankar #Palasa #Screen #Theater

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube